Jump to content

ఎం.వెంకటరమణ

వికీపీడియా నుండి
ఎం.వెంకటరమణ
ఎం.వెంకటరమణ


ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 - 20099
2014 - 2014
నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1947
తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2014 డిసెంబర్ 15
చెన్నై
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి ఎం.సుగుణ
వృత్తి రాజకీయ నాయకుడు

మన్నూరు వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తిరుపతి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం.వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో కాంగ్రెస్ తరపున, 2014లో తెలుగుదేశం పార్టీ తరపున రెండుసార్లు తిరుపతి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు.

ఎమ్మెల్యేగా పోటీ

[మార్చు]
సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
1999 చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ ఎం.వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ
2004 ఎం.వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ ఎన్.వి.ప్రసాద్ తెలుగుదేశం పార్టీ
2012 ఉప ఎన్నిక భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎం.వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ
2014 ఎం.వెంకటరమణ తెలుగుదేశం పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

మరణం

[మార్చు]

ఎం.వెంకటరమణ గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యం బారిన పడి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆరోగ్యం విషమించడంతో 2014 డిసెంబరు 15న మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (6 July 2016). "Tirupati MLA Venkatramana passes away" (in Indian English). Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
  2. Deccan Chronicle (15 December 2014). "Tirupati MLA M Venkataramana passes away while undergoing treatment at Chennai" (in ఇంగ్లీష్). Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
  3. The News Minute (25 February 2015). "Tirupati TDP MLA M Venkata Ramana no more" (in ఇంగ్లీష్). Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.