ఎం.కృష్ణస్వామి.
ఎం.కృష్ణస్వామి తమిళనాడులోని ఆరణి నియోజకవర్గం నుండి 15వ లోక్ సభకు గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాల్యం
[మార్చు]ఎం.కృష్ణస్వామి 1940 జూన్ 9లో తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని మేలేపట్టు గ్రామంలో జన్మించాడు. వీరి తల్లి దండ్రులు ఎ.మురుగ గౌండర్, శ్రీమతి....
విద్య
[మార్చు]ఈయన మద్రాసు లా కాలేజీలో బి.ఎ. బి.ఎల్. చదివారు. కొంత కాలం న్యాయవాద వృత్తిని చేపట్టారు.
కుటుంబము
[మార్చు]వీరు 1966 సెప్టెంబరు 2 న కె.వి.చిత్రను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు.
రాజకీయ ప్రస్తానము
[మార్చు]కృష్ణస్వామి 1980-82 లో తమిళనాడు కాంగ్రేస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 1991లో 10 వ లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2006 నుండి 2008 వరకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు. 2009 లో కాంగ్రేస్ పార్టీ తరుపున పార్లమెంటు సభ్యత్వానికి పోటీ చేసి గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు.
విదేశీ పర్యటన
[మార్చు]వీరు ఐరోపా దేశాలు, జపాన్., మలేసియా మంగోలియా సింగ పూర్, అమెరికా వంటి దేశాలు పర్యటించారు.