Jump to content

ఎం.ఎస్.ప్రభాకర్ రావు

వికీపీడియా నుండి
ఎం.ఎస్. ప్రభాకర్ రావు
ఎం.ఎస్.ప్రభాకర్ రావు


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1961 మే 1
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి ఉష శ్రీ
నివాసం ప్రశాంత్ హిల్స్, ఖాజాగూడ, రాయదుర్గం, హైదరాబాద్.[1]

ఎం.ఎస్. ప్రభాకర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ శాసన మండలి సభ్యుడు. ఆయన ప్రస్తుతం శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా ఉన్నాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఎం.ఎస్.ప్రభాకర్ రావు 1961, మే 1న హైదరాబాదులో శ్యామ్ రావు, లక్ష్మి బాయి దంపతులకు జన్మించాడు. ఆయన 1984లో నిజాం కాలేజీ నుండి బిఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎం.ఎస్.ప్రభాకర్ రావు తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఎం.ఎస్.ప్రభాకర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2010 ఎన్నికల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆయన ఈ పదవిలో 2010 నుండి 2013వరకు ఉన్నాడు. ఆయన మళ్ళీ 2014 నుండి 2019 వరకు రెండవసారి ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఆయన 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3] ఆయన 2019లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4][5][6]

ఆయన 2024 జూలై 5న టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. The Hans India (16 November 2017). "Venkateshwar Kalyanam organised". www.thehansindia.com. Archived from the original on 12 May 2021. Retrieved 12 May 2021.
  2. Sakshi (9 March 2019). "ఎమ్మెల్సీగా ఎంఎస్‌ ప్రభాకర్‌ ఎన్నిక". Sakshi. Archived from the original on 29 May 2021. Retrieved 29 May 2021.
  3. Telugu360 (3 December 2015). "TDP and TCong suffer setback in Greater Hyderabad". Telugu360.com. Archived from the original on 12 May 2021. Retrieved 12 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Telangana Today (2 March 2019). "TRS' Prabhakar Rao files papers for MLC polls". Archived from the original on 12 May 2021. Retrieved 12 May 2021.
  5. suryaa (2 March 2019). "TRS nominated Prabhakar Rao as MLC candidate". Archived from the original on 12 May 2021. Retrieved 12 May 2021.
  6. The New Indian Express (9 March 2019). "Prabhakar Rao unanimously elected as MLC". The New Indian Express. Archived from the original on 12 May 2021. Retrieved 12 May 2021.
  7. NT News (5 July 2024). "కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు." Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.