Jump to content

ఉషా చిలుకూరి

వికీపీడియా నుండి
ఉషా చిలుకూరి
జననంఉషా చిలుకూరి
(1986-01-06) 1986 జనవరి 6 (వయసు 38)
శాన్ డియాగో, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
రాజకీయ పార్టీడెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ
భార్య / భర్తజె డి వాన్స్
పిల్లలు3

ఉషా చిలుకూరి వాన్స్ (ఉషా బాల చిలుకూరి; జననం , 1986 జనవరి 6) ఒక అమెరికన్ న్యాయవాది. ఉష కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాకు వలస వెళ్లింది. ఉషా చిలుకూరి కాలిఫోర్నియాలో జన్మించింది. [1]ఆమె 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన అయిన ఒహాయో సేనేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న జె.డి.వాన్స్ భార్య.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఉషా చిలుకూరి, కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో తెలుగు మాట్లాడే భారతీయ సంతంతికి చెందిన కుటుంబంలో జన్మించింది. [2] [3] ఉషా చిలుకూరి తల్లితండ్రులు భారతదేశం [4] నుండి అమెరికాకు వలస వచ్చారు. ఉషా చిలుకూరి తల్లితండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మి చిలుకూరి, ఇద్దరూ ప్రొఫెసర్లు. [5] [6] ఉషా చిలుకూరి తల్లిదండ్రులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. [7] ఉషా చిలుకూరి పుస్తకాలు ఎక్కువగా చదివేది. దీంతో ఆమె స్నేహితులు అందరూ"పుస్తకాల పురుగు" అని పిలిచేవారు. [8]

ఉషా చిలుకూరి యేల్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రురాలైంది.

వృత్తి జీవితం

[మార్చు]

ఉషా చిలుకూరి 2014–2015 వరకు అప్పటి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసింది. 2017–2018 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్‌కు సహాయకురాలిగా పనిచేసింది ఉషా చిలుకూరి మే 2019లో డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా బార్ లో చేరింది. జూలై 2024 వరకు న్యాయ సంస్థ ముంగెర్, టోల్లెస్ & ఓల్సన్ LLP లో పనిచేసింది. [9]

ఉషా చిలుకూరి గేట్స్ కేంబ్రిడ్జ్ అలుమ్ని అసోసియేషన్ బోర్డు లోని సిన్సినాటి సింఫనీ ఆర్కెస్ట్రా బోర్డు కార్యదర్శిగా పనిచేసింది. [10]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఉషా చిలుకూరి జె.డి. వాన్స్ ను 2014లో కెంటకీలో మతాంతర వివాహం చేసుకుంది. [11] [8] ఉషా చిలుకూరి జెడి వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు: ఇవాన్ (జననం 2017), వివేక్ (జననం 2020), మిరాబెల్ (జననం 2021). [12] [13] ఆమె హిందూ మతాన్ని గౌరవిస్తుంది. ఆమె భర్త రోమన్ క్యాథలిక్. [11] [14]

మీడియా

[మార్చు]

2020 లో ఆమె భర్త జీవితం ఆధారంగా తీసిన హిల్‌బిల్లీ ఎలిజీ చలనచిత్రంలో, ఉషా పాత్రను నటి ఫ్రీదా పింటో పోషించింది.

మూలాలు

[మార్చు]
  1. https://abcnews.go.com/Politics/usha-vance-jd-vances-wife-leaves-law-firm/story?id=111969572
  2. Sheerin, Jude. "Who is Usha Vance, lawyer and wife of Trump's VP pick?". BBC. Retrieved 16 July 2024.
  3. https://www.christiantoday.co.in/news/ohio-senator-jd-vance-reveals-hindu-wifes-support-for-his-christian-faith.html
  4. "Trump VP Mate's wife is Telugu origin Usha Chilukuri". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2024-07-16. Retrieved 2024-07-16.
  5. "Dr. Krish Chilukuri". Retrieved July 15, 2024.
  6. "Lakshmi Chilukuri". Retrieved July 15, 2024.
  7. "Who is Usha Chilukuri Vance? Indian-origin wife of Trump's VP pick JD Vance". Moneycontrol. 16 July 2024. Retrieved 16 July 2024.
  8. 8.0 8.1 Bernstein, Joseph (July 15, 2024). "Who Is Usha Vance, the Wife of J.D. Vance?". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved July 15, 2024.
  9. Schonfeld, Zach (July 15, 2024). "JD Vance's wife leaving law firm". The Hill. Retrieved July 15, 2024.
  10. Sen, Sumanti. "Who is Usha Chilukuri? Ohio's GOP Senate primary winner JD Vance's wife once clerked for Brett Kavanaugh". MEA WorldWide. Retrieved July 15, 2024.
  11. 11.0 11.1 Bhatia, Shireen (July 16, 2024). "Ohio Senator JD Vance reveals Hindu wife's support for his Christian faith". Christian Today (in ఇంగ్లీష్). Retrieved July 15, 2024.
  12. "Meet JD Vance's Indian American Wife Usha Chilukuri". India West. Retrieved July 15, 2024.
  13. "J.D. Vance's 3 Kids: All About Ewan, Vivek and Mirabel". Peoplemag (in ఇంగ్లీష్). Retrieved July 15, 2024.
  14. "JD Vance and his wife discuss the potential of being picked for Trump's VP | Fox News Video". Fox News (in అమెరికన్ ఇంగ్లీష్). June 26, 2024. Retrieved July 15, 2024.