ఉషశ్రీ చరణ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉషశ్రీచరణ్‌

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – 2024 జూన్ 4

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - 4 జూన్ 2024
నియోజకవర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 16 జులై 1976
కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రత్నమ్మ, కె.విరూపాక్షప్ప
జీవిత భాగస్వామి శ్రీచరణ్‌
సంతానం దివిజిత్‌ శ్రీచరణ్, జయనా శ్రీచరణ్‌

కేవీ ఉషశ్రీచరణ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. ఉషశ్రీచరణ్‌ 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఉషశ్రీ 16 జులై 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా , కళ్యాణదుర్గంలో రత్నమ్మ, కె.విరూపాక్షప్ప దంపతులకు జన్మించింది. ఆమె ఎమ్మెస్సీ వరకు చదువుకుంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉషశ్రీచరణ్‌ తెలుగుదేశం పార్టీ ద్వారా 2012లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్న సమయంలో 2014లో టీడీపీని వీడి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[3] ఆమె 2014లో కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి, పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేపట్టింది. ఆమె 2019లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వరనాయుడుపై 19,896 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.[4] ఉషశ్రీచరణ్‌ 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[5][6]

ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పెనుకొండ నుండి పోటీ చేసి ఓడిపోయింది.[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌ సీపీ అనంతపురం అభ్యర్థులు వీరే." Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  3. Sakshi (1 December 2014). "వైఎస్ఆర్ సీపీలో చేరిన ఉషశ్రీ చరణ్". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  4. Sakshi (25 May 2019). "కొత్త కొత్తగా ఉన్నది". Archived from the original on 26 September 2021. Retrieved 26 September 2021.
  5. Sakshi (10 April 2022). "కంచుకోటను బద్దలు కొట్టి.. మంత్రి వర్గంలో." Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  6. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Penugonda". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.