Jump to content

ఉమామహేశ్వరపురం (బాపులపాడు)

అక్షాంశ రేఖాంశాలు: 16°36′34″N 80°54′36″E / 16.609347°N 80.910034°E / 16.609347; 80.910034
వికీపీడియా నుండి
(ఉమామహేశ్వరపురం(బాపులపాడు) నుండి దారిమార్పు చెందింది)

ఉమామహేశ్వరపురం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఉమామహేశ్వరపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఉమామహేశ్వరపురం is located in Andhra Pradesh
ఉమామహేశ్వరపురం
ఉమామహేశ్వరపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°36′34″N 80°54′36″E / 16.609347°N 80.910034°E / 16.609347; 80.910034
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి కాకాని అరుణ
పిన్ కోడ్ 521 105
ఎస్.టి.డి కోడ్ 08656

విద్యుత్తు

[మార్చు]

స్థానిక ఎన్.టి.అర్.కాలనీలో, 2 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన విద్యుత్తు సౌకర్యాన్ని, 2015,నవంబరు-24వ తేదీనాడు లాంఛనంగా ప్రరంభించినారు. [2]

మీ-సేవా కేంద్రం

[మార్చు]

ఉమామహేశ్వరపురం గ్రామoలో, 2017,ఆగష్టు-11న, నూతనంగా మీ-సేవా కేంద్రాన్ని ప్రారంభించినారు. [3]

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

చింతాయకుంట చెరువు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఉమామహేశ్వరపురం, కోడూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జులైలో కోడూరుపాడు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో అగస్తీయమ్మ సర్పంచిగా ఎన్నికైంది. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామంలో కోలాటం, 50 సంవత్సరాలకు పైగా నిత్యనూతనంగా విరాజిల్లుతూ వస్తుంది. జిల్లాలో, చుట్టుప్రక్కల, ఏ ఉత్సవాలు జరిగినా, ఈ గ్రామ యువకుల కోలాట ప్రదర్శన ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక డప్పుబృందాన్ని గూడా ఏర్పాటుచేసికొన్నారు. వ్యవసాయ పనులు చేసికొనేవారు, ఇంజనీరింగు, డిగ్రీ చదివేవారు సైతం, మొత్తం 30 మంది, ఈ కోలాటబృందంలో సభ్యులుగా ఉండటం విశేషం. రోజూ ఎవరి పనులలో వారు నిమగ్నమైనా, వారానికి ఒకరోజు మాత్రం, కోలాటం సాధన చేస్తారు. లయబద్ధంగా నాట్యం చేస్తూ, 13, 14 రకాల కోలాటగోపులు వేస్తూ, పాటలు పాడుతుంటారు. ఈ రకంగా వీరు మరుగున పడుతున్న ఈ జానపదకళకు జవజీవాలను అందించుచున్నారు. కోలాట సాధన, ప్రదర్శనలను ఆనవాయితీగా కొనసాగించుచూ, ప్రాచీనకళకు జీవం పోయుచున్నారు. [1]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

[1] ఈనాడు విజయవాడ; 2014,సెప్టెంబరు-12, 4వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-26; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2017,ఆగష్టు-12; 7వపేజీ.