Jump to content

ఉమాప్రసాద్ మాలెంపాటి

వికీపీడియా నుండి
ఉమాప్రసాద్ మాలెంపాటి

ఉమాప్రసాద్ మాలెంపాటి ఓ తెలుగు యాత్రికుడు.

జీవిత విషయాలు

[మార్చు]

ఉమాప్రసాద్ కృష్ణా జిల్లా వాస్తవ్యుడు. కానీ తల్లిదండ్రులు తెనాలిలో స్థిరపడ్డారు. బాల్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో పెరిగిన ఉమా ప్రసాద్, చిన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఉపాధి కోసం క్యాంటిన్లలో, నిర్మాణ సంస్థలలో, సైకిల్ రిపేర్ షాపులలో కూడా పనిచేశాడు. ఇదే క్రమంలో తనకు ఓ బంధువు ద్వారా మాలి దేశం వెళ్లే అవకాశం లభించింది. దీంతో పశ్చిమ ఆఫ్రికా ఖండానికి చెందిన ఆ దేశానికి ఆయన ప్రయాణమయ్యాడు. అక్కడే ఆయనకు తన చిరకాల కోరిక అయిన ట్రావెల్ వీడియోగ్రఫీ పై ఆసక్తి పెరిగింది. [1]

దీంతో తను వెళ్లే ప్రతి ప్రాంతానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించి, అక్కడి వీడియోలను ఉమా ప్రసాద్ యూట్యూబులో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ఉమా తెలుగు ట్రావెలర్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఇదే క్రమంలో మాలి దేశపు స్థానిక భాష అయిన బంబారాపై మంచి పట్టు సాధించాడు. మాలి దేశంలో ఉమా ప్రసాద్ తీసిన అప్లోడ్ వీడియోలకు మంచి ఆదరణ లభించడంతో ఇతడు, తర్వాత ఇతర దేశాలను కూడా సందర్శించాలని భావించాడు. [2]

ఇప్పటికి టాంజానియా, కెన్యా, ఉగాండా, జాంబియా లాంటి ఆఫ్రికా దేశాలతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు , యూరప్ , రష్యా సహా 20 పైగా దేశాలను ఉమా ప్రసాద్ సందర్శించాడు. ఆఫ్రికా ప్రజల జీవనాన్ని, ఆఫ్రికా అడవులలోని గిరిజన ప్రజల సంప్రదాయాలను తన వీడియోలలో ఉమా ప్రతిబింబిస్తూ ఉండడంతో, ఆయనకు ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం యూట్యూబులో ఉమా ప్రసాద్ ఛానల్‌కు 7 లక్షలకు పైచిలుకు ఫాలోవర్లు ఉన్నారు .[3][4]

మూలాలు

[మార్చు]
  1. "A Little bit of Telugu in Africa". www.newindianexpress.com. NEW INDIAN EXPRESS. Archived from the original on 2021-06-03. Retrieved 3 June 2021.
  2. "విదేశాల్లో స్థిరపడి.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న తెలుగు 'వ్లాగర్స్'". www.andhrajyothy.com. ANDHRA JYOTHY. Archived from the original on 2021-06-03. Retrieved 3 June 2021.
  3. "10 Telugu Foreign Vloggers". Archived from the original on 2021-06-03. Retrieved 2021-06-03.
  4. "తెనాలి కుర్రోడు.. తగ్గేదే లే.. చదివింది 8.. నెలకు రూ.3లక్షలకుపైనే." Sakshi. 2022-01-02. Retrieved 2022-01-02.