Jump to content

ఉప్పులేటి కల్పన

వికీపీడియా నుండి
ఉప్పులేటి కల్పన
ఉప్పులేటి కల్పన


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం పామర్రు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 23 ఆగష్టు
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రామారావు
జీవిత భాగస్వామి దేవి ప్రసాద్
సంతానం 2

ఉప్పులేటి కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఉప్పులేటి కల్పన 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలో జన్మించింది. ఆమె విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ నుండి బి.ఈ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిడుమోలు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి, 2009లో పామర్రు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయింది. ఉప్పులేటి కల్పన 13 సెప్టెంబర్ 2012న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితురాలై 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, వైఎస్సార్‌సీపీ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా నియమితురాలైంది. ఆమె 10 సెప్టెంబర్ 2014న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యురాలి (సీజీసీ)గా నియమితురాలైంది.[2]

ఉప్పులేటి కల్పన 23 డిసెంబర్ 2016న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరింది.[3]ఆమె 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కైలే అనిల్‌ కుమార్‌ చేతిలో 30,873 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (10 September 2014). "వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలిగా ఉప్పులేటి కల్పన". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  3. Deccan Chronicle (23 December 2016). "YSR Congress MLA Kalpana back in TDP" (in ఇంగ్లీష్). Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.