Jump to content

ఉప్పాడ జమ్‌దానీ చీరలు

వికీపీడియా నుండి
ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

ఉప్పాడ జమ్‌దానీ చీరలు
వివరణఉప్పాడ చీర అనేది భారతదేశానికి చెందిన ఉప్పాడ (ఆంధ్ర ప్రదేశ్) కు చెందిన చేనేత చీర.
రకంవస్త్రం
ప్రాంతంఉప్పాడ
దేశంభారతదేశం
నమోదైంది2009

భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

ఉప్పాడ చీర అనేది భారతదేశానికి చెందిన ఉప్పాడ (ఆంధ్ర ప్రదేశ్) కు చెందిన చేనేత చీర.[1][2] అవి డయాఫానస్ పట్టు చీరలు. ఈ చీరలకు భౌగోళిక గుర్తింపు లభించింది.[3]

చరిత్ర

[మార్చు]

చేనేత వస్త్రాల తయారీలో మూడొందల ఏళ్ల చరిత్ర ఉంది. జామ్దానీ చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళానైపుణ్యాన్ని మరో చాటిచెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళానైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జామ్దానీ చీరలను చూడాలంటే ఇక్కడకు రావాల్సిందే. చేనేత కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం.. 1972వ సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు. దీంతో ఉప్పాడ ఖ్యాతి దేశస్థాయిలో ప్రాచుర్యం పొందింది.[4]

జమ్‌దానీ

[మార్చు]

జమ్‌దానీ బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప కళ. జమ్‌దానీ అనేది పర్షియన్ పదం. "జామ్" అంటే పువ్వు అని అర్థం. బంగ్లాదేశ్‌లోని ఢాకా కేంద్రంగా తయారవుతున్న జమ్దానీ చీరలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. బెంగాల్ సంప్రదాయ నేత కార్మికులు దీన్ని తయారు చేసేవారు. పురాతన కాలంలో దీన్ని అప్పటి చేనేత కార్మికులు తయారు చేశారు. వీటిని మొఘల్ రాజులు, బ్రిటీష్ పాలకుల సతీమణులు ధరించారు. జమ్దానీ సంప్రదాయ నేత కళతో కూడిన నేత ఈ చీరలను యునెస్కో సైతం పురాతన సాంస్కృతిక సంపదగా గుర్తించింది. ఈ చీరలపై మొక్కలు, పూల డిజైన్లతో కూడిన ఈ చీరలను మగువలు ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ ఈ చీరలు కాటన్‌తోపాటు నాణ్యత, స్టయిల్, డిజైన్ల విషయంలో వీటిదే అగ్రస్థానం అంటుంటారు. జారిఫ్ ఫ్యాషన్ డిజైన్ లాంటి కొత్త వారు సైతం జమ్దానీ చీరలను పార్టీ శారీగా ఎంబ్రాయిడరీ కాంబినేషన్, హ్యాండ్ కర్‌చుపి వర్క్స్‌తో తయారు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం సైతం మధ్యదళారులను నివారించి చేనేత కార్మికులకు ప్రోత్సహించేందుకు వీలుగా జమ్దానీ పల్లిని ఢాకా సమీపంలో ఏర్పాటు చేసింది.

బంగ్లాదేశ్‌కు చెందిన ఈ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అక్కడి చేనేత కార్మికుల ద్వారా రూపుదిద్దుకొనే జమ్‌దానీ వస్త్రాలు మగువుల మనసును ఇట్టే ఆకర్షిస్తాయి. మగ్గంపై రూపుదిద్దుకొనే ఈ చీరలు కళాకారుల కళాత్మకతకు ప్రతిబింబాలుగా నిలుస్తాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో జమ్‌దానీ పట్టుచీరలు ధరించటమంటే మగువలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.

కళాత్మకత

[మార్చు]

ఈ చీరల తయారీ కళాత్మకతతో కూడి ఉంటుంది. వందశాతం పట్టు నూలుతో రూపుదిద్దుకొంటున్న ఈ చీరలు కళాకారుల సహనానికి పరీక్షగా నిలుస్తాయి. కళతోపాటు ఓర్పు, నేర్పు అత్యంత అవసరం. చీరను మగ్గంపై నేస్తూ దానిపై డిజైన్‌ను చేతితో చేయాలి. మగ్గంపై 12 గంటలు పనిచేస్తే అరమీటరు చీర ఉత్పత్తి చేయటం సాధ్యంకాదు. ఒక్కో చీర తయారీకి కనీసంగా 15రోజుల సమయం తీసుకొంటుంది. చీర ఖరీదు రూ.5వేల నుంచి రూ.80 వేల వరకు అందులో ఉన్న కళాత్మకత ఆధారంగా ఉంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "News Archives: The Hindu". Archived from the original on 2011-01-14. Retrieved 2016-01-26.
  2. Wide range at Lepakshi exhibition - The Hindu
  3. Uppada Jamdani saris get GI tag
  4. "కళ కోల్పోతున్న చేనేత కార్మికులు". Archived from the original on 2015-09-08. Retrieved 2016-01-26.

ఇతర లింకులు

[మార్చు]