ఉప్పలపాటి
స్వరూపం
ఉప్పలపాటి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
ఇంటి పేరుతో గుర్తింపు పొందిన వ్యక్తులు
[మార్చు]- ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు.
- ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, గోపీకృష్ణా కంబైన్స్ అధిపతి ప్రముఖ సినీ నటుడి కృష్ణంరాజు సోదరుడు.
- ఉప్పలపాటి నారాయణరావు తెలుగు సినిమా దర్శకుడు.
- ఉప్పలపాటి ప్రభాస్ రాజు, తెలుగు సినిమా నటుడు.
- ఉప్పలపాటి సైదులు : పౌరాణిక రంగస్థల కళాకారుడు.[1] అతను సుమారు 8 వేలకు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలిచ్చాడు. నాటకాలలో శ్రీరాముడుగా, శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, శ్రీనివాస, ఇంధ్ర, భవాని, బాలవర్ధి, కార్యవర్ధి, బిల్వ, అర్జున, నకుల, సహదేవ, వికర్ణ, మాతంగి తదితర పాత్రలు ధరించాడు.
- ఉప్పలపాటి వెంకటేశ్వర్లు : సాంకేతిక శాస్త్ర పరిశోధకుడిగా ప్రవేశించి, అనతికాలంలోనే అపూర్వ విజయాలను సాధించి, గమ్య సాధనలో కార్యదీక్షతో అలుపెరుగని కృషి సల్పిన శాస్త్రవేత్త. ఆయన సాంకేతిక విద్యా జ్ఞానాన్ని జనసామాన్యంలోకి తెచ్చిన వ్యక్తి.
- ఉప్పలపాటి సుందరనాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హ్యాచరీస్ వ్యవస్థాపకుడు.
మూలాలు
[మార్చు]- ↑ "సందేశాత్మక నాటికలతోనే సమాజంలో చైతన్యం | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-06-21.