ఉప్పర
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 31 వ కులం. సగర కులస్థులు భగీరథ వంశీయులు. ఒరిస్సాలో వీరిని ఎస్టీలలో చేర్చారు. కర్ణాటకలో వీరు బిసి- ఏ వర్గంలో ఉన్నారు.దాదాపు 30 లక్షల జనాభా ఉన్న సగర కులస్థులు దేశమంతటా ఉన్నారు.జోడీ (భార్యాభర్త) లెక్కన వీరికి కాంట్రాక్టర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకొని ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళతారు. జోడీకి రోజుకు 250 నుంచి 300 రూపాయలకు కూలి. వీరి కులానికి కాంట్రాక్టులు కనీసం 30 శాతం పనులైనా కల్పించాలని కోరుతున్నారు.పనికి వాడే పరికరాల విషయానికి వస్తే ఎంతో కాలం నుంచి సగరులు పార, బొచ్చెకే పరిమితం కాగా, వీరి రెక్కల కష్టంతో పైకెదిగినవారు రెడీమిక్సర్లు తెస్తున్నారు. ఇవి ఒక్క రోజుకు 25 నుంచి 30 మంది ముఠా పనివారి ఉపాధిని మింగేస్తున్నాయి. నాలుగు అంతస్తుల లోపు వినియోగిస్తున్న లిఫ్టులు 15మంది పనిని, పొక్లయినర్లు 50మంది పనిని చేయడంతో వీరు ఉపాధి కోల్పోతున్నారు.జలయజ్ఞం పనుల్లో 200 కోట్ల రూపాయల విలువైన అండర్ టనెల్ యూనిట్లను బడా కాంట్రాక్టర్లు ప్రవేశపెడుతున్నారు. ఐదు సంవత్సరాలపాటు జరిగేపని వీటివల్ల రెండేళ్ళలోపూర్తవుతోంది. ఎర్త్ వర్క్ మిషన్లు, రోడ్లు వేసే మిషన్లు ఫలితంగా దాదాపు.ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ లేకుండా టెండర్లలో పాల్గొనే అవకా శం . కోరుతున్నారు. భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియాను రాస్జ్ట్ష్ర్ష్ ప్రభుత్వం 2007 మే ఒకటవ తేదీ కార్మిక దినోత్సవ వేడుకల్లో ప్రకటించింది.దాన్ని రెండులక్షలకు పెంచుతున్నామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.మృతి చెందినవారికి రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డులు లేకపోవటం వల్ల యజమాని లేదా, కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.కాంట్రాక్టరు దగ్గర పనిచేస్తూ మరణిస్తే అతనిదే బాధ్యత కనుక కార్మికునికి ముందుగా ఇన్సూరెన్స్ చేయించాల్సిఉంది. కానీ అటువంటి సహాయక చర్యలు జరగడం లేదు.గర్భిణులకు మూడు నెలలపాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కర్నాటక ప్రభుత్వం అక్కడి సగరుల అభివృద్ధికి `కర్నాటక రాజ్య సగర
మూలాలు
[మార్చు]ST