ఉపమన్యు మహర్షి

వికీపీడియా నుండి
(ఉపమన్యు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉపమన్యు మహర్షి ఒక రుగ్వేద రుషి. శివుని భక్తుడు. శివుడు తన తపస్సుకు మెచ్చి వరం, దీవెనలు ఇచ్చాడు

ఉపమన్యు మహర్షి భారతీయ ఋషి. వ్యాఘ్రపాదుడు అను మహాత్ముని కుమారులు ఉపమన్యు, ధౌమ్యుడు. ఇతని కథ మహాభారతములో అనుశాసనిక పర్వములో కలదు, కానీ తిక్కన భారతములో లేదు.

బాల్యం

[మార్చు]

వ్యాఘ్రపాద మహర్షి ఇల్లాలు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుచుండెను. ఒకనాడు బంధువుల ఇంట్లో పాయసము రుచి తెలిసి, అటువంటి పాయసాన్నము వండి పెట్టమని తల్లిని కోరిరి. లేదనిక చింతింతురని పిష్టరసమును తయారుచేసి పిల్లలకిచ్చెను. అది రుచింపక పాయసమే కావలయునని మారాముచేసిరి. అప్పుడి ఆ తల్లి ఆవు లేనిదే పాలురావు. పాలు లేనిదే పాయసాన్నము రాదని చెప్పెను. ఆవునెవరిత్తురు? మా కోరిక తీర్చువారెవరు? అని వారు ప్రశ్నించిరి. అనంతరం ఆ మహాసాధ్వి ఈశ్వరుడు సర్వ కామ్యములు తీరునని తెలిపెను. శివధ్యానం చేసి ఏకంగా పాలసముద్రాన్నే పొందుతానన్నాడు ఉపమన్యుడు. అతడికి అంత పట్టుదల కూడా ఉన్నదని ఆ తల్లికి తెలుసు!

తల్లి మాటలు విని ఉపమన్యుడు బయలుదేరి ఒక ఏకాంత ప్రదేశమున ఎడమకాలి బొటనవ్రేలిపై నిలిచి మహాతపస్సు చేయనారంభించెను. నూరేండ్లు పండ్లు మాత్రమే తిని, మరి నూరేండ్లు ఆకులు మాత్రమే తిని, ఇంకొక నూరేండ్లు నీరు మాత్రమే త్రాగి, ఇంకొక నూరేండ్లు గాలి మాత్రమే పీల్చి, ఇలా మొత్తము వెయ్యి సంవత్సరములు ఉపమన్యువు పరమశివుని ఆరాధించెను.

ఈశ్వరునికి అతనిపై దయకలిగి పరీక్షించదలచి ఇంద్రుడి వేషములో వెళ్లి భోగభాగ్యాదులు ఇస్తానని ఆశ చూపించాడు. బూడిద తప్ప ఏమి ఇవ్వలేని శివుడినేం అడుగుతావు? ఆయన ఏమిస్తాడు? అని ఎద్దేవా చేశాడు. శివనింద భరించజాలక చెవులు మూసుకుని తక్షణం అక్కడి నుంచి ఆ ఇంద్ర వేషధారిని కదలమని హెచ్చరించాడు ఉపమన్యుడు.అంత ఉపమన్యుడు ఆతని నిరాకరించి పశుపతిని తప్ప ఇతరుల్ని అర్ధింపను అని పలికెను. ఇంకా తాత్సారం చేస్తున్న అతడ్ని వెళ్లగొట్టాలని తల్లి తనకు రక్షగా ఇచ్చిన భస్మం పిడికిట్లో పట్టుకుని అఘోరాస్త్రం మది తలచి ప్రయోగించబోగా అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తుని కన్నులపండగజేసెను. తదనంతరము ఉపమన్యుడు పరమ శివభక్తుడై చిరకాలము జీవించెను.

శ్రీకృష్ణుడు ఉపమన్యుని దర్శించుట

[మార్చు]

శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరైన జాంబవతి భర్తని తనకొక సుపుత్రుని ఇమ్మని ప్రార్థించెను. అందుకు కృష్ణుడు తాను పండ్రెండేండ్లు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసినగాని సుపుత్రుడు లభించుట దుర్లభమని పలికెను. అంతనామెకు పుత్రునిచ్చుటకై కృష్ణుడు తపస్సు చేయుటకు అంగీకరించెను.

మూలాలు

[మార్చు]