Jump to content

ఉన్ని కృష్ణన్

వికీపీడియా నుండి
పి. ఉన్ని కృష్ణన్
ఉన్ని కృష్ణన్
జననంపి. ఉన్ని కృష్ణన్
(1966-07-09) 1966 జూలై 9 (వయసు 58)

పాలక్కాడ్, కేరళ, భారతదేశం
నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుఉన్ని కృష్ణన్
వృత్తినేపధ్య గాయకుడు
శాస్త్రీయ సంగీత గాయకుడు
, సంగీత పోటీల న్యాయ నిర్ణేత
వెబ్‌సైటు
http://www.unnikrishnan.com/

ఉన్ని కృష్ణన్ (జననం: 1966 జూలై 9) ప్రముఖ శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, ఆంగ్ల భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ఎన్నావలె అది ఎన్నావలెకి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా శాస్త్రీయ సంగీత గీతాలాపనకు ప్రాముఖ్యత నిస్తాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఉన్నికృష్ణన్ కె.రాధాకృష్ణన్, డాక్టర్ హరిణి దంపతులకు కేరళలోని పాలక్కాడ్లో జన్మించాడు.[1] వారు నివాసం పేరు కేసరి కుటీరం. అది మద్రాసు నగరంలో పేరెన్నిక గన్నది. అతని ముత్తాత కె. ఎన్. కేసరి పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. తెలుగు మహిళల కోసం గృహలక్ష్మి అనే పత్రికను ప్రోత్సహించాడు. 1983 లో చెన్నైలోని ఆసాన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివాడు. రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాలలో చదివాడు. మద్రాసు విశ్యవిద్యాలయం నుంచి బీకాం పూర్తి చేశాడు. ప్యారీస్ కన్ఫెక్షనరీ లిమిటెడ్ అనే సంస్థలో 1987 నుంచి 1994 దాకా అధికారిగా పనిచేశాడు. తరువాత ఉద్యోగం వదిలి పెట్టి పూర్తి స్థాయి గాయకుడిగా మారాడు.

ఉన్నికృష్ణన్ భార్య ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి ప్రియ. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె. వీరి కుమార్తె ఉత్తర కూడా గాయనిగా రాణిస్తోంది. ఆమె పాడిన నేపథ్య గీతానికి జాతీయ పురస్కారం అందుకుంది.[2]

జనాదరణ పొందిన పాటలు

[మార్చు]

తెలుగు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Unnikrishnan:Profile And Biography". Metromatinee.com. 1966-07-09. Archived from the original on 2010-05-05. Retrieved 2011-11-07.
  2. Sakshi (9 July 2021). "తొలిపాటకే నేషనల్ అవార్డు.. ఈ సింగర్ గుర్తున్నాడా?". Archived from the original on 10 సెప్టెంబరు 2021. Retrieved 10 September 2021.