ఉదయభాను
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉదయభాను | |
జన్మ నామం | ఉదయభాను |
జననం | సుల్తానాబాద్,కరీంనగర్, తెలంగాణ | 1980 ఆగస్టు 5
ఇతర పేర్లు | భాను |
భార్య/భర్త | శ్రీనివాస్ |
ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త, నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ఆ షో ప్రధాన ఉద్దేశం. ఆమెకు అప్పటికి యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది.[1]
బాల్యం, తలిదండ్రులు
[మార్చు]ఆమె తండ్రి డాక్టర్, తల్లి ఆయుర్వేద వైద్యురాలు. ఆమెకు సాప్ట్‌వేర్ జాబ్ చేసే ఒక తమ్ముడు ఉన్నాడు.[2] ఆమె తండ్రి ఒక కవి. ఆయన కలంపేరు ఉదయభాను. దానినే కూతురుకు పెట్టాడు. ఆయన ఉదయభానుకు నాలుగేళ్ళ వయసులో చనిపోయారు. [3] ఆయన చనిపోయాక తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొంది. అతడికి ఏడుగురు సంతానం. ఆమె 15 వ ఏట ఒక ముస్లీంతో వివాహం జరిగింది. ఆమెకు ఇష్టం లేకపోవటం వలన విడాకుల అనంతరం విజయకుమార్ అనే అతడిని తల్లి అనుమతికి వ్యతిరేకంగా వివాహం చేసుకొన్నది. ఆమె ఎం.ఏ వరకూ చదివింది.
సినీ జీవితం
[మార్చు]10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది,[3] తరువాత కొన్ని తమిళ, కన్నడ సినిమాలో నటించింది
నటించిన చిత్రాలు
[మార్చు]- లీడర్ (2010)
- కొండపల్లి సింహాసనం
- ఆపదమొక్కులవాడు
- జులాయి
- శ్రావణమాసం
- ఖైదీ బ్రదర్స్
- ప్రతినిధి 2 (2024)
టెలివిజన్ కార్యక్రమాలు
[మార్చు]- హృదయాంజలి (ఈ టీవీ)
- వన్స్ మోర్ ప్లీజ్ (జెమినీ టీవీ)
- సాహసం చేయరా డింబకా (జెమినీ టీవీ)
- డ్యాన్స్ బేబీ డ్యాన్స్ (జెమినీ టీవీ)
- రేలారే రే రేలా (మా టీవి)
- ఢీ రియాలిటీ డ్యాన్స్ షో (ఈ టీవీ)
- జాణవులే నెరజాణవులే (జెమినీ టీవీ)
- పిల్లలు పిడుగులు (జెమిని టీవి)
మూలాలు
[మార్చు]- ↑ "ఉదయభానుపై ప్రముఖ ఆంగ్ల పత్రిక [[ది హిందూ]] లో వచ్చిన వార్త 2". Archived from the original on 2012-11-07. Retrieved 2010-08-08.
- ↑ "A bundle of energy". The Hindu. Chennai, India. 30 September 2002. Archived from the original on 1 జూలై 2003. Retrieved 16 జూన్ 2016.
- ↑ 3.0 3.1 ఐడిల్ బ్రెయిన్ లో ఉదయభాను ముఖాముఖి