ఉత్తర టెక్సస్ హిందూ దేవాలయం
ఉత్తర టెక్సస్ హిందూ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | టెక్సస్ |
ప్రదేశం: | డల్లాస్ |
అక్షాంశ రేఖాంశాలు: | 32°51′38″N 96°42′20″W / 32.860669°N 96.705475°W |
ఉత్తర టెక్సస్ హిందూ దేవాలయం, అమెరికా, టెక్సస్ లోని డల్లాస్‌లో ఉన్న హిందూ దేవాలయం. డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్‌లో ఉన్న అనేక హిందూ దేవాలయాలలో ఇది ఒకటి.[1] 2002లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసం సెక్టారియన్ హిందూ దేవాలయంగా ప్రారంభించబడింది.
చరిత్ర
[మార్చు]1992లో డల్లాస్-ఫోర్ట్ వర్త్ ఏరియాలోని ఇండో-కరేబియన్ ప్రవాస భారతీయులు, కరేబియన్ హిందూ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్‌ను స్థాపించారు. ఈ సంస్థ 2002లో, చాంట్ డల్లాస్‌లోని ఓల్డ్ లేక్ హైలాండ్స్ నైబర్‌హుడ్‌లో ఒక పాత ప్రార్థనా మందిరాన్ని కొనుగోలు చేసి, ఇంటీరియర్‌ని పెయింట్ చేయించి, అనేక దేవతామూర్తిలను స్థాపించారు. 2002లో ఇది ప్రారంభించబడింది.
ఇతర వివరాలు
[మార్చు]2015, ఏప్రిల్ 15న మారా సాల్వత్రుచాకు చెందిన పలువురు సభ్యులు దేవాలయ తలుపులపై '666' అని గీయడం ద్వారా దేవాలయాన్ని ధ్వంసం చేశారు. దేవాలయ గోడలపై డెవిల్ ఆరాధనకు సంబంధించిన వివిధ చిహ్నాలను స్ప్రే చేశారు.[2] దాంతో దేవాలయం ప్రాంగణం చుట్టూ అనేక కెమెరాలను, భవిష్యత్తులో మరిన్ని దాడులు జరగకుండా నిరోధించడానికి చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది.[3]
రూపకల్పన
[మార్చు]ఈ దేవాలయం లోపలి భాగంలో మరికొన్ని హిందూ దేవతామూర్తులు ఉన్నాయి. వాటికి పీఠాలు లేవు కాబట్టి భక్తులు మూర్తిలను తాకి చూడవచ్చు.
ఛారిటీ
[మార్చు]దేవాలయానికి చెందిన యువత నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ వంటి ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థల కోసం వివిధ కార్యక్రమాలు చేస్తుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "North Texas Hindu Mandir". dfwindia. Retrieved 2022-03-14.[permanent dead link]
- ↑ "Hindu Temple in Texas Vandalized with Graffiti". 20 April 2015. Archived from the original on 2020-02-06. Retrieved 2022-03-14.
- ↑ Lucia, Andrea (18 April 2015). "Hindu Temple Increasing Security After Temple Vandalized". dfw.cbslocal.com. Retrieved 2022-03-14.
- ↑ "North Texas Hindu Mandir". blog.smu.edu. Retrieved 2022-03-14.