ఉత్తర కుమారుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉత్తరుడు విరాటరాజు, సుధేష్ణ కుమారుడు. ఉత్తర ఇతని సహోదరి.
పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. ఒకసారి పాండవుల అజ్ఞాతవాసం భంగము చేయుటకు ధుర్యోధనాది కౌరవులు విరాట రాజ్యముపై ఇరువైపులా దండెత్తారు. అందరు వీరులు ఒకవైపు దండెత్తిన కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనుటకు వెళ్లారు. రెండవ వైపు నుంచి వస్తున్న కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనుటకు వీరులు ఎవరూ లేని సమయమున ఉత్తరుడు తాను ఒక్కడినే ఎదుర్కొనగలనని ప్రగల్భాలు పలికి అర్జునుని రధసారధిగా కౌరవ సేనపై దండెత్తెను. ఆ యుద్ధములో భయపడుతున్న ఉత్తరుని రధసారధ్యం చేయమని చెప్పి అర్జునుడు కౌరవ సైన్యాన్ని ఓడించాడు. ఈ యుద్ధమందు అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రం వల్ల ధుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు మొదలగువారు ఉన్న మొత్తం కౌరవ సేన కొంతసేపు స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు ఉత్తరుడు కౌరవ వీరుల తలపాగాలు కత్తిరించి తెచ్చి ఉత్తరకు ఇచ్చాడు.
ఇతని కూతురు ఇరావతిని పరీక్షిత్తు నకు వివాహము చేసెను.
కురుక్షేత్ర సంగ్రామంలో ఉత్తరుడు పాండవుల పక్షాన యుద్ధం చేసి మొదటి రోజే శల్యుని చేతిలో మరణించాడు.