Jump to content

ఉత్తమ ఇల్లాలు (1958 సినిమా)

వికీపీడియా నుండి
ఉత్తమ ఇల్లాలు
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.ఎస్.ఎ.స్వామి
కథ ఎ.ఎస్.ఎ.స్వామి,
అరు.రామనాథన్
చిత్రానువాదం ఆత్రేయ
తారాగణం జెమిని గణేశన్,
సావిత్రి
సంగీతం జి.రామనాథన్
నేపథ్య గానం ఎ.ఎం.రాజా,
పిఠాపురం నాగేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
ఎం.ఎల్.వసంతకుమారి,
పి.లీల,
ఎ.పి.కోమల,
జిక్కి,
యు.రాము
ఛాయాగ్రహణం పి.రామస్వామి
నిర్మాణ సంస్థ జుపిటర్ పిక్చర్స్
భాష తెలుగు

ఉత్తమ ఇల్లాలు 1958లో జుపిటర్ పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన డబ్బింగ్ సినిమా. 1957లో విడుదలైన తమిళ సినిమా కర్పుక్కరసి దీని మాతృక.

నటీనటులు

[మార్చు]
  • జెమినీ గణేశన్ - ప్రతాపుడు
  • ఎం.ఎన్.నంబియార్ - జయవీరుడు
  • ఎం.కె.రాధ - వజ్రపురి రాజు
  • కె.ఎ.తంగవేలు - చిట్టికప్ప
  • ఆర్.బాలసుబ్రహ్మణ్యం - మాంత్రికుడు
  • పి.ఎస్.వెంకటాచలం - సచ్చిదానందయోగి
  • పి.బి.రంగాచారి - మునీశ్వరుడు
  • సావిత్రి - మంజుల
  • జి.వరలక్ష్మి -చంద్రిక
  • ఇ.వి.సరోజ - శశికళ
  • కె.ఆర్.చెల్లం - సింగారి
  • ఎం.సరోజ - పంకజం
  • ఎస్.రేవతి - మాయలరాణి
  • ఎస్.మోహన - మోహన

సాంకేతిక వర్గం

[మార్చు]

సామాన్య కుటుంబంలో పుట్టిన చంద్రిక ఒక ముని చెప్పినట్లుగానే తాను మహారాజును వివాహం చేసుకుంటుంది. తాను మహారాణి కావడం తన సవతితల్లి సింగారికి కడుపు మండి, చంద్రికను రాణి పదవిలో నుండి తొలగించి తన కడుపున పుట్టిన మోహినిని ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి వలపన్ని ఒక మాంత్రికుని సహాయంతో తన కోరికను నెరవేర్చుకుంటుంది. చంద్రిక రూపాన్ని మోహినికి, మోహిని రూపాన్ని చంద్రికకు మారిపోతుంది. వేరే దారిలేక చంద్రిక తనకు మహారాణివి అవుతావని చెప్పిన ముని వద్దే కాలం గడుపుతూ ఉంటుంది. సింగారి సాయం పొందిన మాంత్రికుడు మోహిని కడుపున పుట్టిన కుమారుని తను కోరినప్పుడు తనకు అప్పగించాలని సమయం కోసం కాచుకుని ఉంటాడు. ఇక్కడ ముని ఆశ్రమంలో ఉన్న చంద్రికకు ఒక కుమారుడు, అక్కడ అంతఃపురంలో ఉన్న మాయాచంద్రికకు ఒక కుమారుడు కలుగుతారు. అసలు చంద్రిక కుమారుని పేరు ప్రతాపుడు. ప్రతాపుడు పెరిగి పెద్దవాడై తన తల్లి నిజస్థితిని మునిద్వారా తెలుసుకుని తన తల్లి నిజరూపాన్ని ఇచ్చే కల్పకఫలాన్ని తెస్తానని తన తండ్రిని చూస్తానని బయలుదేరి తండ్రి వద్దకు చేరతాడు. తండ్రిని చూస్తాడు కానీ ప్రతాపుడెవరైంది రాజుకు తెలియదు. అక్కడే మంత్రి కుమార్తె మంజులను ప్రతాపుడు ప్రేమిస్తాడు. కల్పకఫలం కోసం బయలుదేరుతాడు. సమయం కోసం ఎదురుచూస్తున్న మాంత్రికుడు చంద్రగ్రహణం రోజున మహారాజును మాయచంద్రిక కొడుకు జయవీరుని చేతులతో చంపించి అష్టసిద్ధులను పొందాలని ఆ విషయాన్ని మరుగుపరిచి చంద్రికను భయపెట్టి ప్రతాపుడు అసలు చంద్రిక పుత్రుడేనని చెప్తాడు. జయవీరుని ద్వారా మహారాజుకు మరణదండన విధిస్తానంటాడు. మాయాచంద్రిక మంత్రగాడికి అడ్డు తగులుతుంది. మాంత్రికుడు ఆమెను కత్తితో పొడుస్తాడు. సింగారి ఇది చూసి మూర్చపోతుంది. జయవీరుడు యథార్థం తెలుసుకుంటాడు. తానే మహారాజును చంపడానికి సిద్ధపడతాడు. అక్కడ ప్రతాపుడు కల్పకఫలాన్ని తేవడానికి వెళ్ళి ఒక దేవకన్యను ప్రేమిస్తాడు. ఆమె ద్వారా కల్పకఫలాన్ని పొందుతాడు. అక్కడ మునీశ్వరుని కోపానికి గురై తల్లిని చూస్తే రాయి అయిపోతాడని శాపాన్ని పొందుతాడు. చేసేది లేక తన స్నేహితుడైన చిట్టికప్పకు ఆ ఫలాన్ని ఇచ్చి తన తల్లికి ఇవ్వమని పంపి తాను మహారాజు వద్దకు బయలుదేరుతాడు. ఇక్కడ చంద్రిక తన అసలు రూపాన్ని పొంది మహారాజుకు ఆపద ఉందని తెలుసుకుని అక్కడకు బయలుదేరుతుంది. మాంత్రికుడు తన మనసులో ఉన్న నిజాన్ని వెళ్ళగక్కుతూ కాళికను పూజిస్తూ ఉంటాడు. పక్కనే చాటుగా వింటున్న జయవీరుడు మాయచేసి మాంత్రికుని చేపగా మార్చివేస్తాడు. మహారాజును తానే చంపివేసి అష్టమహాశక్తులను పొందాలని పేరాశపడి మహారాజును చంపడానికి సిద్ధపడతాడు. అదే సమయానికి ప్రతాపుడు అడ్డుపడతాడు. కానీ చంద్రిక అక్కడికి వచ్చేస్తుంది. ప్రతాపుడు ఏడ్చి తన తల్లికి శాపం గురించి చెప్పి శిలగా మారిపోతాడు. అదే సమయానికి మంజుల కూడా అక్కడకు చేరుకుంటుంది. చంద్రగ్రహణ సమయానికి తన కార్యం నెరవేరలేదని మాంత్రికుడు కోపంతో వాళ్ళను భస్మం చేస్తానంటాడు. అంతలో దేవకన్య అక్కడికి వస్తుంది. మాంత్రికుని శక్తులన్నీ మంటగలుస్తాయి. మంజుల, దేవకన్య ద్వారా ప్రతాపుని శాపవిమోచన మార్గాన్ని తెలుసుకుని తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడుతుంది. దేవకన్య ఆమెను అడ్డుకుంటుంది. పతాక సన్నివేశంలో ప్రతాపునికి అసలు రూపం వచ్చి మాంత్రికుని సంహరించడంతో కథ సుఖాంతమౌతుంది.[1]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలనన్నింటినీ శ్రీశ్రీ రచించాడు.[1]

క్ర.సం పాట పాడినవారు
1 హాయి మీరునే మనం ఊయలూగునే
2 చిన్నీ చిలకా తల్లీ సుఖమా ఎ.పి.కోమల
3 ఆడుమయ్యా ఓ అందాలయ్యా ఉడుతా సరోజిని
4 దైవం న్యాయము నేలున్ ఇలా ధర్మమే పాలించున్
5 చూడాలి నే చూడాలి సిరిసంపదలతో పాలు పారు లోకమునె చూడాలి
6 పొలుపారు పల్ సుఖముల్ భోగమ్ముల్ నావయితే
7 కాయవే ధనమాయెరా ఇది కాచుటకు జడుపేలరా
8 హృదయవీధినే ఉదయమాయనే
9 వేదము కాలము నాటి జగన్మాతా నీకు నేను నమస్కరింతూ
10 వెయ్యినోళ్ల కొనియాడు రసకల్పమే ఎందు వెలపోసి కొనరాని ఘనశిల్పమే
11 ఎడబాసి నేనుండనే ఇంకెందుకు నీవేడ్చెదవే
12 ఇది చాలా అతిశయమే మది కదిలే కలకలమే
13 నేలనీ పాకితే నాలుక్కాళ్ళూ, నిలిచీ నడిచే సరికి రెండు కళ్ళూ
14 కలయా కల్లయా ప్రేమకలాపం కోరవా

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సోమసుందరం (1958). ఉత్తమ ఇల్లాలు పాటల పుస్తకం. మద్రాసు: జుపిటర్ ఫిల్మ్‌స్. p. 9. Retrieved 16 May 2021.