ఉత్కర్ష్ వర్మ
ఉత్కర్ష్ వర్మ | |||
![]() ఉత్కర్ష్ వర్మ జూన్ 25, 2024న లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
ముందు | అజయ్ మిశ్రా టెని | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఖేరీ | ||
పదవీ కాలం నవంబర్ 2010 – 2017 | |||
తరువాత | యోగేష్ వర్మ | ||
నియోజకవర్గం | లఖింపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లఖింపూర్ ఖేరి, ఉత్తరప్రదేశ్, భారతదేశం | 1985 నవంబరు 1||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | అవంతిక సింగ్ | ||
నివాసం | యువరాజ్ దత్తా పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల సమీపంలో, రాజ్‌గఢ్, లఖింపూర్ ఖేరీ | ||
పూర్వ విద్యార్థి | ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు [1] |
ఉత్కర్ష్ వర్మ (జననం 1 నవంబర్ 1985) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖేరీ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]ఉత్కర్ష్ వర్మ సమాజ్ వాదీ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2010లో లఖింపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో నుండి ఎస్‌పీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2012లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి జ్ఞాన్ ప్రకాష్ బాజ్‌పాయ్‌పై 37,993 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఉత్కర్ష్ వర్మ 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లఖింపూర్ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ వర్మపై 37,748 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2022లో జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ వర్మపై 20,578 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
ఉత్కర్ష్ వర్మ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖేరీ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్‌పై 34,329 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Candidate affidavit". My neta.info. Retrieved 1 June 2016.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ "Uttar Pradesh Assembly Elections 2022". Election Commission of India. 2022. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
- ↑ "Kheri Constituency Lok Sabha Election Result" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
- ↑ "Lok Sabha 2024 Election Results: Lakhimpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.