ఉట్నూర్ బస్ స్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉట్నూర్ బస్ స్టేషన్, 13 మార్చి 1993 లో ప్రారంభమైనది.తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ పట్టణంలో ఉంది[1].ఇది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ స్టేషన్ ఈ బస్ స్టేషన్ బస్సుల నిలుపుట,నిర్వహణ, మరమత్తుల కొరకు ప్రక్కనే బస్సు డిపో కూడా ఉంది. ఈ బస్ స్టేషన్ నుండి హైదరాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల ఆదిలాబాద్ ,జివితి,సేన్ గావ్,కిన్వట్,మహోర్, యావత్మల్ వంటి మహారాష్ట్ర పట్టణాలకు బస్సులను కూడా నడుపుతుంది[2].

ఉట్నూర్ బస్ స్టేషన్
ఉట్నూర్ బస్ స్టేషన్ లో ఉట్నూర్-ఆదిలాబాద్ బస్సు
సాధారణ సమాచారం
Locationఉట్నూర్, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ
భారత దేశము
యజమాన్యంతెలంగాణ ప్రభుత్వం
నిర్వహించువారుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
Bus routesహైదరాబాద్,ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల మహారాష్ట్ర
Bus standsఆదిలాబాద్
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణిక ( నేలమీద )
ఇతర సమాచారం
స్టేషను కోడుUTR
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

శంకుస్థాపన

[మార్చు]

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉట్నూరు ప్రయాణ ప్రాంగణమును 9 మే 1989 లో అప్పటి కార్మిక శాఖా మంత్రి బి.జనార్ధన్ ఖానాపూర్ శాసన సభ సభ్యులు అజ్మీరా గోవింద్ నాయక్ ,ఆర్టీసీ జనరల్ మేనేజర్ కరీంనగర్ కే.యస్.యస్.ఆర్.మూర్తి చేతుల మీదగ సంఖుస్థాపన జరగినది.

ప్రారంభోత్సవం

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉట్నూరు ప్రయాణ ప్రాంగణమును 14 మార్చి 1993 లో అప్పటి రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి కే.భీంరావు, ఆర్టీసీ జనరల్ మేనేజర్ కరీంనగర్ కే.యస్.యస్.ఆర్.మూర్తి చేతుల మీదగ ప్రారంభోత్సవం జరగినది.

ఆర్టీసీ బస్సులు

[మార్చు]

ఆర్టీసీ బస్సులు[3] సురక్షితమైన బస్సు సేవా లకు ప్రసిద్ధి .ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇచ్చేలా వారు కఠినమైన నిర్వహణ ,భద్రత ప్రమాణాలను అనుసరిస్తారు. బస్సు సర్వీసులు ఖచ్చితమైన షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాత్రికులకు,పర్యాటకుల ప్రయాణ అవసరాలను తీరుస్తుంది. ఆదిలాబాదు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్ సందర్శించే వారు ఖచ్చితంగా బస్సు ప్రయాణాన్ని ఎంచుకోండి.

సేవలు

[మార్చు]

ఉట్నూరు డిపో నుండి పల్లె వెలుగు, ఎక్సప్రేస్ బస్సులు ఆదిలాబాద్, మంచిర్యాల్,కరీంనగర్, నర్సంపేట,వరంగల్,కాళేశ్వరం, నిల్వాయి ,ఆసిఫాబాద్,హైదరాబాద్, మహారాష్ట్రలోని జివితి, శేన్ రావ్, మహోర్,కిన్వట్,ఉమర్ ఖేడ్, చంద్రపూర్ బయలు దేరుతాయి[4]. ప్రయాణికులు ఉట్నూరు నుండి హైదరాబాద్ మార్గంలో ప్రయాణించడానికి ఆర్టీసీ వివిధ రకాల బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ బస్ టికెట్ లను ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే టికెట్ ధరల పై డబ్బు ఆదా చేసుకోవడానికి తగ్గింపు ఆఫర్లు ఇస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Utnoor Bus Station in Utnoor India". www.india9.com (in ఇంగ్లీష్). Retrieved 20240714. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "TSRTC Utnoor to Hyderabad Bus Booking: Timings, Fares". AbhiBus (in ఇంగ్లీష్). Retrieved 2024-07-14.
  3. "APSRTC Utnoor Bus Station | Utnoor Bus Station Map". www.onefivenine.com. Retrieved 2024-07-14.
  4. Bestbus. "Utnoor Bus Schedules - Utnoor Bus Timings - Bus Schedules from Utnoor". BestBus (in English). Retrieved 2024-07-14.{{cite web}}: CS1 maint: unrecognized language (link)