ఉగ్రరూపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉగ్రరూపం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.రోసిరాజు
తారాగణం శారద,
శివకృష్ణ,
విజ్జి
నిర్మాణ సంస్థ జయభారతీ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఉగ్రరూపం 1984 ఆగస్టు 30 న విడుదలైన ఒక తెలుగు సినిమా.జయభేరి ప్రొడక్షన్స్ పతాకంపై, ఎం.రోసిరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామకృష్ణ, శారద,శివకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు .

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎం.రోసిరాజు
  • మాటలు: పైడిపల్లి రవీంద్రబాబు
  • సంగీతం: సత్యం
  • ఛాయాగ్రహణం: వి.లక్ష్మణ్
  • నిర్మాత: ఎస్.ఆర్.హనుమంతరావు

ఎస్.ఐ. అర్జునరావు నిజాయితీ గల ఒక పోలీస్ ఉద్యోగి. అతని భార్య సుభద్ర దైవభక్తి పరాయణురాలు. వారి కొడుకు విజయ్ అభ్యుదయ భావాలు కల యువకుడు. అయితే అంధుడు. రౌడీ పిల్ల రేఖ ఒకసారి ఎస్.ఐ.కి తారసపడి సుభద్ర అభిమానాన్ని చూరగొని వాళ్ళింట్లోకి ప్రవేశిస్తుంది. విజయ్, రేఖలు ప్రేమించుకుంటారు. విజయ్‌కు చూపు రావడానికి ఆపరేషన్ చేయాలంటే 25 వేల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెబుతాడు. ఇంతలో కిల్లర్ కింగ్స్‌ను పట్టుకున్నవారికి ప్రభుత్వం 25 వేల రూపాయల బహుమతి ప్రకటిస్తుంది. అర్జునరావు శాయశక్తులా కష్టపడి కిల్లర్ కింగ్స్‌ను పట్టుకుని బహుమతి సంపాదిస్తాడు. విజయ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగి ఇంటికి తిరిగి వచ్చేసరికి కిల్లర్ కింగ్స్ ముఠా వాళ్ళు అర్జునరావును దారుణంగా హత్యచేస్తారు. "నా కుంకుమ చెరిగి నీళ్ళలో కలిసేలోగా హంతకులను తెచ్చి నా కాళ్ళముందు పడేయాలి" అని సుభద్ర విజయ్‌ను ఆదేశిస్తుంది. విజయ్ రేఖ సహాయంతో హంతకులను వేటాడతాడు.[1]

పాటల జాబితా

[మార్చు]

1.ఈడూ జోడూ చూసుకోవాలి చేరా , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి

2 కలసి ఉంటే ఎంత సుఖం అనుకొంటే అంత సుఖం , రచన; వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

3.జయ జయ శాంకర జయ సుగుణాకరి(దండకం) గానం.పి సుశీల , రచన: సాంప్రదాయం

4.నీ కన్నులలో వెలిగింది ఆ కైలాసం, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

5.మంగళరూపం మనోహర రూపం నా ముందర , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

6.శ్రీ చక్ర సింహాసిని పరిపాలించు శ్రీరాజరాజేశ్వరి, రచన: డి.రామారావు , గానం. పులపాక సుశీల .

మూలాలు

[మార్చు]
  1. వి (7 September 1984). "చిత్రసమీక్ష: ఉగ్రరూపం". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 7 November 2018.[permanent dead link]

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉగ్రరూపం&oldid=4235684" నుండి వెలికితీశారు