Jump to content

ఉందా..లేదా..? (2017 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
ఉందా..లేదా..?
దర్శకత్వంఅమనిగంటి వెంకట శివప్రసాద్‌
రచనఅమనిగంటి వెంకట శివప్రసాద్‌
నిర్మాతఎస్‌.కమల్‌
తారాగణంరామకృష్ణ, అంకిత, ఝూన్సీ, జీవా
ఛాయాగ్రహణంప్ర‌వీణ్ కె బంగారి
కూర్పుమ‌ణికాంత్ తెల్ల‌గూటి
సంగీతంశ్రీముర‌ళీ కార్తికేయ
నిర్మాణ
సంస్థ
జయకమల్‌ ఆర్ట్‌
విడుదల తేదీ
15 డిసెంబరు 2017 (2017-12-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఉందా లేదా 2017లో తెలుగు విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] జయకమల్‌ ఆర్ట్‌ బ్యానర్‌పై ఎస్‌.కమల్‌ నిర్మించిన ఈ సినిమాకు అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వం వహించాడు.[2] రామకృష్ణ, అంకిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేసి,[3] సినిమాను డిసెంబర్ 15న విడుదల చేశారు.

రాజ్ (రామకృష్ణ) ఒక డాక్యుమెంటరీ ఫిలిమ్ మేకర్. విజయవాడలోని రాజా హరిశ్చంద్ర ప్రసాద్ ప్రభుత్వ లేడీస్ హాస్టల్‌‌లో రుబీనా అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ఆత్మహత్య వెనక కారణం కనిపెట్టేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కూడా రుబీనా మాదిరిగానే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఈ హాస్టల్ లో దెయ్యం ఉందని, ఈ ఆత్మహత్యలకు కారణం అదే అని ప్రచారం మొదలవుతుంది. రుబీనా ఆత్మహత్య తర్వాత ఈ హాస్టల్‌లో నందిని(అంకిత) అనే మెడికల్ స్టూడెంట్ చేరుతుంది. నందిని కూడా రుబీనా మాదిరిగానే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. తన ప్రియురాలు నందిని కాపాడేందుకు (రామకృష్ణ) రంగంలోకి దిగుతాడు. మరి అతడు ఏం చేశాడు? నిజంగానే ఈ హాస్టల్‌లో దెయ్యం ‘ఉందా... లేదా?' అనేది మిగతా కథ.

నటీనటులు

[మార్చు]
  • రామకృష్ణ
  • అంకిత
  • కుమార్ సాయి
  • ఝూన్సీ
  • జీవా
  • రామ్‌జ‌గ‌న్
  • ప్ర‌భావ‌తి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: జయకమల్‌ ఆర్ట్‌
  • నిర్మాత: ఎస్‌.కమల్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్‌
  • సంగీతం: శ్రీముర‌ళీ కార్తికేయ
  • సినిమాటోగ్రఫీ: ప్ర‌వీణ్ కె బంగారి
  • ఎడిటర్: మ‌ణికాంత్ తెల్ల‌గూటి
  • కొరియోగ్ర‌ఫీ: నందు జెన్నా
  • పాట‌లు:నాగరాజు కువ్వార‌పు ,శేషు మోహ‌న్
  • పాటలు:సింహ ,హేమ‌చంద్ర ,స్వీక‌ర్ అగ‌స్సీ
  • స‌హానిర్మాత‌లు: అల్లం సుబ్ర‌మ‌ణ్యం ,అల్లం నాగిశెట్టి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 February 2017). "సస్పెన్స్ థ్రిల్లర్‌". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  2. Sakshi (16 May 2016). "వినూత్నమైన స్క్రిప్ట్". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  3. Sakshi (17 November 2017). "సౌండ్‌ పొల్యూషన్‌..." Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.

బయటి లింకులు

[మార్చు]