Jump to content

ఇ - సంజీవని

వికీపీడియా నుండి

భారత ప్రభుత్వ ఉచిత టెలి మెడిసిన్ సేవ అయిన ఈ సంజీవని ఇటీవల 8 కోట్ల టెలికన్సల్టేషన్లను పూర్తి చేయడం ద్వారా మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది .కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఇ - సంజీవని డిజిటల్ ప్లాట్ ఫారమ్ రోగులకు సత్వరమైన ఔట్ పేషెంట్ సేవలను అందిస్తుంది[1] .ఇది వర్టికల్ హబ్- అండ్- స్పోక్ మోడల్ లో పనిచేస్తుంది. ఇందులో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి., ఎంబీబీఎస్, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, వైద్యులు అనుసంధానించబడ్డాయి.గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రోగికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ మోడల్ 1,09,748 ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో, 14,188 హబ్ లలో విజయవంతంగా అమలు చేయబడింది[2]. ఏబి - హెచ్డబ్ల్యు సి సహాయంతో టెలి కన్సల్టేషన్లను అందించడం ద్వారా ఈ సంజీవని గ్రామీణ -పట్టణ డిజిటల్ ఆరోగ్య యంత్రాలను తగ్గించడానికి కృషి చేస్తుంది . ఈ ప్లాట్ ఫారాన్ని ఉపయోగించడంలో మొదట ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు మహారాష్ట్ర[3].

  1. "Union Health Minister, Dr Mansukh Mandaviya hails the "eSanjeevani" landmark milestone of providing telemedicine services to more than 10 Crore patients". pib.gov.in. Retrieved 2023-09-16.
  2. "India's telemedicine service eSanjeevani completes over 14 crore consultations: Center". The New Indian Express. Retrieved 2023-09-16.
  3. "What is eSanjeevani HWC Teleconsultation?". www.dghealth.in (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.