ఇలవేల్పు
స్వరూపం
ఇలవేల్పు (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
నిర్మాణం | ఎల్.వి.ప్రసాద్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, చలం, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నేపథ్య గానం | పి.సుశీల, రఘునాథ పాణిగ్రాహి, పి.లీల, సుసర్ల దక్షిణామూర్తి |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | లక్ష్మి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 21 జూన్ 1956(భారత్) |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఇలవేల్పు 1956, జూన్ 21న విడుదలైన తెలుగు సినిమా. శివాజీ గణేశన్, పద్మిని జంటగా 1954లో విడుదలైన తమిళ సినిమా ఎదిర్ పరదాతు దీనికి మూలం. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, జూలూరి జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు ,ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు డి. యోగానంద్ కాగా, సంగీత దర్శకత్వం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.
నట బృందం
[మార్చు]- అక్కినేని నాగేశ్వర రావు - శేఖర్
- అంజలి దేవి - శారద
- జమునా రమణారావు - లక్ష్మీ
- గుమ్మడి వేంకెటశ్వర రావు - శేఖర్ తండ్రి
- రేలంగి వేంకటరామయ్య
- చలం
- రమణారెడ్డి
- కృష్ణ కుమారి
- సూర్యకాంతం
- డా. శివరామకృష్ణయ్య
- ఆర్ నాగేశ్వర రావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: దాసరి యోగానంద్
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయితలు:శ్రీరంగం శ్రీనివాసరావు,కొసరాజు రాఘవయ్య చౌదరి, అనిశెట్టి సుబ్బారావు, వడ్డాది బుచ్చి కూర్మనాథం
నేపథ్య గానం: సుసర్ల దక్షిణామూర్తి, జిక్కి, రఘునాథ్ పాణిగ్రాహి, పులపాక సుశీల, పి.లీల
నిర్మాణ పర్యవేక్షణ: ఎల్.వి.ప్రసాద్
నిర్మాణ సంస్థ: లక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల:21:06:1956.
పాటలు
[మార్చు]- "చల్లని పున్నమి వెన్నెలలోనే" గీతం రేలంగి వెంకటరామయ్య పై చిత్రీకరంచారు.
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: సుసర్ల దక్షిణామూర్తి.
సం. | పాట | పాట రచయిత | గానం | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అన్నన్న విన్నావా చిన్ని కృష్ణుడు" | అనిసెట్టి | జిక్కి కృష్ణవేణి | |
2. | "ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని" | అనిసెట్టి | రఘునాథ పాణిగ్రాహి | |
3. | "చల్లని పున్నమి వెన్నెలలోనే" | వడ్డాది | సుసర్ల దక్షిణామూర్తి, పి.సుశీల | |
4. | "చల్లని రాజా ఓ చందమామ" | వడ్డాది | రఘునాథ పాణిగ్రాహి, పి.సుశీల, పి.లీల | |
5. | "నీమము వీడి అజ్ఞానముచే పలుబాధలు పడనేల" | కొసరాజు | పి.లీల బృందం | |
6. | "స్వర్గమన్న వేరే కలదా శాంతి వెలయు" | అనిసెట్టి | పి.లీల | |
7. | "జనగణ మంగళదాయక రామం" | పి.లీల బృందం | ||
8. | "నీవే భారతస్త్రీలపాలిట వెలుగు చూపే" | శ్రీశ్రీ | పి.లీల బృందం | |
9. | "పలికన బంగారమాయెనటే పలుకుము" | వడ్డాది | పి.సుశీల | |
10. | "పంచభూతైకరూపం పావనం (పద్యం)" | పి.లీల | ||
11. | "గంప గయ్యాళి అదే గంప గయ్యాళి సిగ్గుమాలి" | కొసరాజు | పి.సుశీల |
విశేషాలు
[మార్చు]- ఈ సినిమాను హిందీలో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో మీనాకుమారి, రాజ్‌కపూర్ నాయకీనాయకులుగా శారద పేరుతో తీసి 1957లో విడుదల చేశారు.
- ఇదే సినిమా మలయాళంలో నిత్యకన్యక పేరుతో 1963లో విడుదలయ్యింది.
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- తెలుగు సినిమా పాటలు బ్లాగు - నిర్వాహకుడు - కొల్లూరి భాస్కరరావు (జె. మధుసూదనశర్మ సహకారంతో)