Jump to content

ఇబ్రహీం ఖలీల్

వికీపీడియా నుండి
ఎం ఇబ్రహీం ఖలీల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎం ఇబ్రహీం ఖలీల్
పుట్టిన తేదీ (1982-10-09) 1982 అక్టోబరు 9 (వయసు 42)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002–ప్రస్తుతంహైదరాబాదు క్రికెట్ జట్టు
2007–2008హైదరాబాద్ హీరోస్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ List A T20
మ్యాచ్‌లు 57 47 18
చేసిన పరుగులు 2,158 818 224
బ్యాటింగు సగటు 29.16 22.72 17.23
100s/50s 3/9 0/5 0/1
అత్యధిక స్కోరు 141 78 68*
క్యాచ్‌లు/స్టంపింగులు 186/25 59/17 14/7
మూలం: ESPNcricinfo, 2018 జూన్ 23

ఇబ్రహీం ఖలీల్, తెలంగాణకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్. హైదరాబాదు క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్‌గా, యునైటెడ్ స్టేట్స్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌గా ఆడాడు. కుడిచేతి వాటం కలిగిన ఖలీల్ 2002 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి వచ్చాడు. 2007లో జరిగిన ఇండియన్ క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ హీరోస్ తరపున ఆడాడు. 2009లో హైదరాబాదు క్రికెట్ జట్టు కొరకు ఆడటానికి ఆథరైజ్డ్ క్రికెట్‌కి తిరిగి వచ్చాడు. 2011లో అస్సాంతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా వికెట్ కీపర్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 14 తీసుకున్నాడు.

జననం

[మార్చు]

ఇబ్రహీం 1982, అక్టోబరు 9న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

క్రీడారంగం

[మార్చు]

హైదరాబాదు యువ క్రికెట్ జట్టు తరపున అండర్ -16, అండర్ -19 స్థాయిలో ఆడిన ఇబ్రహీం[1] 2002 నవంబరులో రంజీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ప్రవేశించాడు.[2] మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు, రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు క్యాచ్‌లు, స్టంపింగ్‌లు తీసుకున్నాడు.[3] 2005 చివరిలో ఆంధ్రా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 128 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[4] తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టుతో రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులతో మరో సెంచరీ సాధించాడు.[5] నెల తరువాత, సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది క్యాచ్‌లు తీసుకున్నాడు.[6]

ఇండియన్ క్రికెట్ లీగ్ ఉనికిలో ఉన్నంత వరకు జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.[7] ఇండియన్ క్రికెట్ లీగ్ 20s గ్రాండ్ ఛాంపియన్‌షిప్ 2007-08,[8] ఇండియన్ క్రికెట్ లీగ్ 20s వరల్డ్ సిరీస్ 2007-08లలో గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇండియా XI లో హైదరాబాద్ హీరోస్ జట్టులో ఉన్నాడు.[9]

బిసిసిఐ, ఇండియన్ క్రికెట్ లీగ్ క్రీడాకారులు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు తిరిగి రావడానికి అంగీకరించినప్పుడు, ఇబ్రహీం కూడా ఈ ఆఫర్‌కు ఒప్పుకొని[10] 2009 నవంబరులో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు.[2] 2010 చివరిలో బ్యాటింగ్ లో తన అత్యుత్తమ విజయాన్ని సాధించాడు, జార్ఖండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగులు చేశాడు, ఇందులో బావనకా సందీప్‌తో 175 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.[11] సంవత్సరం తరువాత, అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లు, మూడు స్టంపింగ్‌లతోపాటు రెండవ ఇన్నింగ్స్‌లో మరో ఏడు క్యాచ్‌లు తీసుకొనొ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో మొత్తం వికెట్ కీపర్ డిస్మిస్‌ల విభాగంలో కొత్త రికార్డును నెలకొల్పాడు.[12][13] 1995-96 లోగాన్ కప్ ఫైనల్‌లో పదకొండు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్‌లు తీసుకున్న వేన్ జేమ్స్ రికార్డు ను ఇబ్రహీం చేధించాడు.[14][15]

2017 మార్చిలో జరిగిన 2017 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ మూడు టౌర్నమెంట్లలో యునైటెడ్ స్టేట్స్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్న ఎంపిక శిబిరానికి పిలవబడ్డాడు.[16] ఇబ్రహీం చికాగోలో లీగ్ క్రికెట్ ఆడాడు, యునైటెడ్ స్టేట్స్ శాశ్వత నివాస హోదాను కలిగి ఉన్నాడు.[16] 2017 సెప్టెంబరులో ఆటి కప్‌కు ముందు, యునైటెడ్ స్టేట్స్ జట్టు కెప్టెన్‌గా నియమించబడ్డాడు.[17] 2018 జనవరిలో వెస్టిండీస్‌లో జరిగిన 2017–18 రీజినల్ సూపర్ 50 టోర్నమెంట్ కోసం యునైటెడ్ స్టేట్స్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[18]

2018 జూన్ 3న గ్లోబల్ టి 20 కెనడా టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్లో మాంట్రియల్ టైగర్స్ జట్టుకు ఆడటానికి ఎంపికయ్యాడు.[19][20] 2018 ఆగస్టు నెలలో నార్త్ కరోలినాలోని మోరిస్‌విల్లేలో జరిగిన 2018-19 ఐసిసి వరల్డ్ ట్వంటీ 20 అమెరికా క్వాలిఫయర్ టౌర్నమెంట్ లో యునైటెడ్ స్టేట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[21]

2018, అక్టోబరులో యునైటెడ్ స్టేట్స్ జట్టు కెప్టెన్ పదవి నుండి తొలగించబడగా, అతని స్థానంలో సౌరభ్ నేత్రవాల్కర్ నియమించబడ్డాడు.[22]

మూలాలు

[మార్చు]
  1. "Other matches played by Ibrahim Khaleel (94)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)[permanent dead link]
  2. 2.0 2.1 "First-Class Matches played by Ibrahim Khaleel (44)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "Hyderabad v Mumbai: Ranji Trophy 2002/03 (Elite Group A)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. "Andhra v Hyderabad: Ranji Trophy 2005/06 (Elite Group B)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  5. "Punjab v Hyderabad: Ranji Trophy 2005/06 (Elite Group B)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  6. "Hyderabad v Services: Ranji Trophy 2005/06 (Elite Group B)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  7. Vasu, A. (ఆగస్టు 16 2007). "ICL moves for Hyderabad players, state unit reacts". ESPNcricinfo. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  8. "Hyderabad Heroes v Lahore Badshahs: ICL 20s Grand Championship 2007/08 (Second Final)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  9. "ICL India XI v ICL World XI: ICL 20s World Series 2007/08 (Final)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  10. Cricinfo staff (జూన్ 2 2009). "List of players and officials offered amnesty by the BCCI". Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  11. "Jharkhand v Hyderabad: Ranji Trophy 2010/11 (Plate Group A)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  12. "Assam v Hyderabad: Ranji Trophy 2011/12 (Plate Group B)". CricketArchive. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  13. ESPNcricinfo staff (నవంబరు 20 2011). "Maharashtra surge to second win". ESPNcricinfo. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  14. "Records / First-class matches / Wicketkeeping records / Most dismissals in a match". ESPNcricinfo. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  15. "Final: Matabeleland v Mashonaland Country Districts at Bulawayo, Apr 19–21, 1996". ESPNcricinfo. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  16. 16.0 16.1 "Former Indian, SL, WI first-class players in USA selection camp". ESPN Cricinfo. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  17. "Ibrahim Khaleel to lead USA in Auty Cup". ESPN Cricinfo. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  18. "Two former India U-19s, ex-WI batsman Marshall named in USA squad". ESPN Cricinfo. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  19. "Global T20 Canada: Complete Squads". SportsKeeda. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  20. "Global T20 Canada League – Full Squads announced". CricTracker. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  21. "Team USA Squad Selected for ICC World T20 Americas' Qualifier". USA Cricket. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  22. "Khaleel sacked, Netravalkar named captain for USA's Super50 squad". ESPN Cricinfo. Retrieved ఆగస్టు 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)