ఇద్దరూ అసాధ్యులే
స్వరూపం
ఇద్దరూ అసాధ్యులే (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
---|---|
నిర్మాణం | ప్రసాదరావు |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ, రజనీకాంత్, గీత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
గీతరచన | ఆచార్య ఆత్రేయ |
కూర్పు | యస్.యస్. లాల్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సారధీ స్టూడియోస్ |
భాష | తెలుగు |
ఇద్దరూ అసాధ్యులే (Iddaru Asadhyule) 1979లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో ఘట్టమనేని కృష్ణ, రజనీకాంత్ పోటాపోటీగా నటించి మెప్పించారు. తెలుగు సూపర్ స్టార్, తమిళ సూపర్ స్టార్ కలసి నటించడం ఈ చిత్రం విశేషం. ఈ చిత్రానికి కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వం వహించగా, గీత, మాధవి , ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- రజనీకాంత్
- గీత - హేమ
- మాధవి
- షావుకారు జానకి - జానకి
- అల్లు రామలింగయ్య
- గిరిబాబు
- జయప్రద
- కవిత
- నాగభూషణం
- సాక్షి రంగారావు
- చలం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కొండా సుబ్బరామ దాస్
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- నిర్మాత: ప్రసాదరావు
- నిర్మాణ సంస్థ: శ్రీసారధి స్టూడియోస్
- సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య, ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కూర్పు: ఎస్.ఎస్.లాల్
- విడుదల:15:01:1979.
పాటలు
[మార్చు]- ఈ బ్రతుకే ఒక ఆట ఇది దేవుడు ఆడే పిల్లాట, రచన : ఆచార్య ఆత్రేయ , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- చినుకు చినుకు పడుతుంటే, రచన : ఆచార్య ఆత్రేయ గానం . పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
- అందాల పాపకు మూడేళ్లు అందరి దీవెన , రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
- నదిలో అలనురా నడిచే కలనురా నిలిచే నీడరా, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.శిష్ట్లా జానకి
- సంకురేతిరి సంబరాల జాతరోయే సందిట్లో, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బృందం
- వేయకు గాలము చేయకు గారాము , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి.
బయటి లింకులు
[మార్చు]- Iddaru Asadhyule movie online
- Ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.