ఇదీలోకం (నాటకం)
స్వరూపం
ఇదీలోకం | |
కృతికర్త: | కొండముది గోపాలరాయశర్మ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | రామా అండ్ కో (పట్టాభి ప్రెస్), ఏలూరు |
విడుదల: | ఆగస్టు, 1946 |
పేజీలు: | 101 |
ఇదీలోకం 1946లో కొండముది గోపాలరాయశర్మ రాసిన మూడంకముల సాంఘీక నాటకం. పెట్టబడిదారుల అరాచకాలు, పేదవారి ఆకలి చావులు వంటి సాంఘిక సమస్యల నేపథ్యంలో ఈ నాటకంలో రాయబడింది.[1][2]
కథానేపథ్యం
[మార్చు]అగ్రవర్ణాల వారితో ఎదురెళ్ళి తిరిగివచ్చిన తక్కువ కులాలవారిని, జీవచ్ఛవంలో కడుపుకక్కుర్తి కొద్ది మానాభిమానాలను చంపుకొని, పొట్టకూటికై ఎంతటి నైచ్యానికైనా సిద్ధపడే అభాగ్యులను, లక్ష్మీనరసయ్య వంటి కరుడుగట్టిన పెట్టుబడిదారులను చూపించబడింది.
పాత్రలు
[మార్చు]- పుల్లడు - మాలవాడు
- పెద్దోడు - పుల్లడి కొడుకు
- బుడ్డోడు - పుల్లడి కొడుకు
- లక్ష్మీనరసయ్య - మిల్లుల యజమాని
- వెంకయ్య - అతడి అన్న
- తాత - బిచ్చగాడు
- శాస్త్రీ - కవి, జ్యోతిష్యుడు
- లచ్చి - పుల్లడి భార్య
ఇతర వివరాలు
[మార్చు]పద్యాలతో, పదిహేనంకాలతో, పౌరాణిక ఇతివృత్తాలతో నాటకాలు ప్రదర్శితమవుతున్న రోజుల్లో ప్రయోగాత్మకంగా కొద్ది అంకాలతో, పద్యాలు లేకుండా పూర్తివచనంలో ఈ నాటకం రాయబడింది. ఆ క్రమంలో రాయబడిన రెండవ నాటకం ఇది.
మూలాలు
[మార్చు]- ↑ సమాజ దర్పణం ఎదురీత, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 3 జూలై 2017, పుట.14
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (8 May 2019). "తొలినుంచి ప్రజా పక్షమే!". www.prajasakti.com. వల్లూరి శివప్రసాద్. Archived from the original on 19 ఆగస్టు 2019. Retrieved 19 August 2019.