Jump to content

ఇఖ్వాన్

వికీపీడియా నుండి

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంలో చురుకుగా పాల్గొని, ఆ తరువాత లొంగిపోయిన కాశ్మీరీ ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ అనుకూల సాయుధ సంస్థ, ఇఖ్వాన్ ఫోర్స్. [1] వాడుకలో దీన్ని ఖ్వాన్ అని అంటారు. స్థానికంగా నాబేద్ అని కూడా అంటారు.

ఏర్పాటు

[మార్చు]

1994 నాటికి, పాకిస్తాన్ గూడచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఇతర ఉగ్రవాద సమూహాల కంటే హిజ్బుల్ ముజాహిదీన్‌కు ఎక్కువ అనుకూలంగా ఉండటం వల్ల, తామను పక్కన పెట్టారని భావించిన ఉగ్రవాదులలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. కూకా పర్రే అని పేరు పొందిన మొహమ్మద్ యూసుఫ్ పర్రే, ఇఖ్వాన్-ఉల్-ముస్లిమీన్‌ను స్థాపించాడు. 1994 ప్రారంభంలో, ఈ బృందం పాకిస్తానీ ప్రభుత్వ మద్దతు ఉన్న తీవ్రవాదులతో పోరాడేందుకు భారత దళాల పక్షాన నిలిచింది. ఇఖ్వాన్‌తో పాటు, జావేద్ అహ్మద్ షా (రాష్ట్ర పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ మద్దతు ఉన్న వ్యక్తి), లియాఖత్ ఖాన్ (కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పనిచేసేవాడు) నిర్వహించే ఇతర సమూహాలు కూడా ఉన్నాయి. 1994 చివరి నాటికి, ఈ మూడు సమూహాలూ ఇఖ్వాన్-ఉల్-ముస్లిమీన్ కింద ఒకే సంస్థగా విలీనం అయ్యాయి.[1]

కార్యకలాపాలు

[మార్చు]

ఇఖ్వాన్ తరఫున చాలామంది ప్రముఖ యోధులు 1996 ఎన్నికలలో పోటీ చేశారు. కూకా పర్రే జమ్మూ కాశ్మీర్ అవామీ లీగ్‌ని స్థాపించి విజయం సాధించాడు. జావేద్ అహ్మద్ షా నేషనల్ కాన్ఫరెన్స్‌లో చేరాడు.[1]

రద్దు

[మార్చు]

1996 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఇఖ్వాన్ అనుసరించిన క్రూరమైన వ్యూహాలను ప్రజలు ఏవగించుకున్నారు. దానికి, వేర్పాటు అనుకూల సంస్థలు చేసుకున్న ప్రచారాలు కూడా తోడై, ఇఖ్వాన్ రాజకీయ వ్యవస్థ నుండి దూరమైంది. ఈ సాయుధ సమూహానికి ప్రభుత్వ మద్దతుపై ఉన్న ముసుగును భారత ప్రభుత్వం తొలగించింది. ఇది ప్రాణనష్టం భారీగా పెరగడానికి దారితీసింది. ఇఖ్వాన్ 150 మంది సభ్యులను కోల్పోయినట్లు భావిస్తున్నారు. 2003 లో ది హిందూ ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇఖ్వాన్‌లోని దాదాపు 350 నుండి 500 మంది సభ్యులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యంతో కలిసి చురుకుగా విధుల్లో పాల్గొన్నారు. వారికి నెలనెలా స్టైఫండ్ లభించేది.[1]

2003 లో బందిపూర్ జిల్లా సోనావారిలో క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి వెళుతుండగా కూకా పర్రేను కాశ్మీరీ ఉగ్రవాదులు చంపేసారు. అంతకు ఒక నెల క్రితం జావేద్ అహ్మద్ షా కూడా శ్రీనగర్‌లోని గ్రీన్‌వే హోటల్‌లో కాశ్మీరీ ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు.[2] లియాఖత్ ఖాన్ కాశ్మీర్‌లో నివసిస్తున్నాడు.

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Swami, Praveen (2003-09-14). "India's forgotten army". The Hindu. Archived from the original on 2004-01-20. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Singh, Onkar (2003-08-28). "Militants killed MLC: J&K DGP". Rediff.com. Archived from the original on 2023-02-02.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇఖ్వాన్&oldid=4312244" నుండి వెలికితీశారు