ఇందూ జైన్
ఇందూ జైన్ | |
---|---|
జననం | ఫైజాబాద్, యునైటెడ్ ప్రావిన్సెస్ అఫ్ బ్రిటిష్ ఇండియా | 1936 సెప్టెంబరు 8
మరణం | 2021 మే 13 న్యూ ఢిల్లీ, భారతదేశం | (వయసు 84)
జాతీయత | భారతదేశం |
వృత్తి | చైర్మన్ & సి.ఈ.ఓ బెన్నెట్ కోల్ మాన్ & కంపెనీ లిమిటెడ్. |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | టైమ్స్ ఫౌండేషన్ ది వన్నెస్ ఫోరమ్ భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్ |
నికర విలువ | US$3.1 billion (ఫిబ్రవరి 2016) |
జీవిత భాగస్వామి | అశోక్ కుమార్ జైన్ |
పిల్లలు | సామీర్ జైన్, వినీత్ జైన్ |
ఇందూ జైన్ భారతదేశానికి చెందిన పాత్రికేయ సంస్థ టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్. ఆమె మీడియానే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించింది. భారత ప్రభుత్వం 2016లో ఇందూ జైన్ ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. [1]
జననం, వివాహం
[మార్చు]ఇందూ జైన్ 1936 సెప్టెంబరు 8న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించింది. ఆమె అశోక్ కుమార్ జైన్‌ను వివాహమాడింది. వీరికి ఇద్దరు కుమారులు సమీర్ జైన్, వినీత్ జైన్ ఉన్నారు.
వ్యాపారరంగం
[మార్చు]ఇందూ జైన్ భర్త అశోక్ కుమార్ జైన్ హృదయ సంబంధిత కారణాలతో అనారోగ్యం చెంది అమెరికాలోని క్వీవ్‌లాండ్‌లో 1999లో మరణించాడు. ఆయన మరణాంతరం 1999లో గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టింది. ఆమె 2015లో 3.1 బిలియన్ డాలర్ల సంపదతో ఇందూ జైన్ ఫోర్స్బ్ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించింది. ఆమె భారత్‌లోని కుబేరుల్లో 57వ స్థానంలో, ప్రపంచంలో 549వ స్థానంలో నిలిచింది.
సేవా రంగం
[మార్చు]ఇందూ జైన్ 2000లో టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్‌జీవోగా తీర్చిధిదింది. తుఫాన్లు, భూకంపాలు, వరదలు, మహమ్మారులు, ఇతర సంక్షోభ సమయాల్లో టైమ్స్ రిలీఫ్ ఫండ్ ద్వారా సాయమందించింది. ఆమె 2000 సంవత్సరంలో యూఎన్ ఆధ్వర్యంలో జరిగిన మిలీనియం వరల్డ్ పీస్ సదస్సులో ప్రసంగించింది.
పద్మభూషణ్ అవార్డు
[మార్చు]ఇందూ జైన్ దేశ పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకు గాను 2016లో ఆమెను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
మరణం
[మార్చు]ఇందూ జైన్ కరోనాతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 మే 13న మరణించింది. [2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (13 ఏప్రిల్ 2016). "Times Group chairman Indu Jain, Rajinikanth and 50 others receive Padmas from President | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 14 మే 2021. Retrieved 14 మే 2021.
- ↑ Eenadu (14 మే 2021). "టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ జైన్ కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 14 మే 2021. Retrieved 14 మే 2021.
- ↑ Sakshi (14 మే 2021). "Indu Jain: టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ కన్నుమూత". Sakshi. Archived from the original on 14 మే 2021. Retrieved 14 మే 2021.
- ↑ Namasthe Telangana (14 మే 2021). "టైమ్స్ గ్రూపు చైర్‌పర్సన్ ఇందూ జైన్ కన్నుమూత". Namasthe Telangana. Archived from the original on 14 మే 2021. Retrieved 14 మే 2021.
- క్లుప్త వివరణ ఉన్న articles
- May 2021 from Use dmy dates
- June 2018 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- Pages using infobox person with unknown parameters
- Infobox person using certain parameters when dead
- ఉత్తర ప్రదేశ్ మహిళలు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- మహిళా వ్యాపారవేత్తలు
- మహిళా సామాజిక కార్యకర్తలు