Jump to content

ఇందిరా శోభన్

వికీపీడియా నుండి
ఇందిరా శోభన్
ఇందిరా శోభన్


వ్యక్తిగత వివరాలు

జననం 13 డిసెంబర్ 1979
చారకొండ, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ
జీవిత భాగస్వామి పోశాల శోభన్ గౌడ్
సంతానం 2
నివాసం ముషీరాబాద్, హైదరాబాద్
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

పోశాల ఇందిరా శోభన్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 ఫిబ్రవరి 2024న కాంగ్రెస్ పార్టీలో చేరింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఇందిరా శోభన్ తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ గ్రామంలో 13 డిసెంబర్ 1979న జన్మించింది. ఆమె పదవ తరగతి వరకు మహబూబ్​నగర్​ జిల్లా బాలానగర్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో చదివి, ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీజీ పూర్తి చేసి, ప్రస్తుతం పి.హెచ్.డి చేస్తుంది.

రాజకీయ జీవితం

[మార్చు]

ఇందిరా శోభన్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేసింది. ఆమె తెలంగాణ జాగృతిలో చేరి మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ మీద ఉన్న అభిమానంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ అధికార ప్రతినిధిగా ప్రజలకోసం, ప్రజా సమస్యల కోసం పార్టీ తరుపున వివిధ అంశాల మీద పోరాటాలు చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేసింది.[2][3]

ఇందిరా శోభన్ టీపీసీసీ శాశ్వత ఆహ్వానితురాలిగా, సూర్యాపేట జిల్లా టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ కోఆర్డినేటర్‌గా, టీపీసీసీ ఓబీసీ సాధికారత కమిటీ సభ్యురాలిగా, హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధక్షురాలిగా, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసింది. ఆమెపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరుపట్ల ఆవేదన చెంది 3 మార్చి 2021న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది.[4][5]

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇందిరా శోభన్

ఇందిరా శోభన్ తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటులో ఉన్న వైయస్‌ షర్మిలను కలిసి తన మద్దతును ప్రకటించి,[6] క్రియాశీలకంగా పని చేసి అధికార ప్రతినిధిగా నియమితురాలైంది.[7]ఆమె పార్టీలో వైఎస్ఆర్‌టీపీ తరఫున పెట్టే మీటింగ్స్, సభలకు, డిబేట్స్‌లో కీలకంగా వ్యవహరించి,[8] కొని అనివార్య కారణాల వల్ల 20 ఆగష్టు 2021న వైఎస్ఆర్‌టీపీ కి రాజీనామా చేసింది.[9][10][11]

ఇందిరా శోభన్ వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీకి రాజీనామా చేసి ఆగష్టు 25న తన భవిష్యత్ కార్యచరణ ప్రకటించి, తాను స్వతంత్రంగా ఉండి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తానని తెలిపింది.[12] ఇందిరా శోభన్ 25 డిసెంబర్ 2021న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది.[13][14][15]ఆమె 2022 ఫిబ్రవరి 1న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[16] ఇందిరా శోభన్ 2023 జనవరి 31న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసింది.[17]

మూలాలు

[మార్చు]
  1. Disha (15 February 2024). "కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత ఇందిరాశోభన్". Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.
  2. Sakshi (21 August 2018). "'టీఆర్‌ఎస్‌ నేతల కాళ్ల కింద భూకంపం'". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
  3. Andhrabhoomi (19 February 2020). "మహిళా కమిషన్ ఏర్పాటు చేయండి". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  4. V6 Velugu (3 March 2021). "కాంగ్రెస్ కు ఇందిరా శోభన్ రాజీనామా" (in ఇంగ్లీష్). Archived from the original on 27 May 2021. Retrieved 19 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The New Indian Express (4 March 2021). "Indira Shoban quits Congress, joins YS Sharmila". Archived from the original on 27 May 2021. Retrieved 19 November 2021.
  6. TV9 Telugu (3 March 2021). "కాంగ్రెస్‌ పార్టీకి ఇందిరా శోభన్‌ రాజీనామా.. షర్మిలతో భేటీ అయిన టీపీసీసీ అధికార ప్రతినిధి". Archived from the original on 27 May 2021. Retrieved 19 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. TV9 Telugu (5 June 2021). "షర్మిల తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధులు వీళ్లే.. మరిన్ని క్షేత్రస్థాయి పర్యటనలతో ముందుకెళ్లేలా ప్రణాళికలు". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. News18 తెలుగు (8 July 2021). "షర్మిలకు అండగా ఉండండి.. నా ఫోన్ దొరికితే తెచ్చివ్వండి.. సభలో మహిళా నేత రిక్వెస్ట్." Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Andhrajyothy (20 August 2021). "YSRTP కి బిగ్ షాక్.. ఇందిరా శోభన్ రాజీనామా". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
  10. V6 Velugu (20 August 2021). "వైస్సార్ తెలంగాణ పార్టీని వీడిన ఇందిరా శోభన్" (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  11. Namasthe Telangana (20 August 2021). "వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్‌ రాజీనామా". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  12. V6 Velugu (25 August 2021). "భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఇందిరా శోభన్." (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. V6 Velugu (25 December 2021). "ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరా శోభన్" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  14. Mana Telangana (25 December 2021). "ఆప్ పార్టీలో చేరిన ఇందిరా శోభన్." Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
  15. Andhrajyothy. "ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరా శోభన్.. చోటా మోదీ కేసీఆర్ అంటూ సెటైర్". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 15 January 2022.
  16. Prabha News (1 February 2022). "తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  17. Disha (31 January 2023). "ఆప్‌కు ఇందిరా శోభన్ రాజీనామా". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.