Jump to content

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం

అక్షాంశ రేఖాంశాలు: 17°52′53″N 83°21′44″E / 17.8814°N 83.3622°E / 17.8814; 83.3622
వికీపీడియా నుండి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం
దస్త్రం:Indian Institute of Management Visakhapatnam Logo.png
నినాదంvidyā paraṁ daivatam (ISO)
ఆంగ్లంలో నినాదం
జ్ఞానమే పరమ దైవం
రకంప్రభుత్వ మేనేజిమెంట్ విద్యా సంస్థ
స్థాపితం2015; 9 సంవత్సరాల క్రితం (2015)
అనుబంధ సంస్థజాతీయ ప్రాధాన్యత గల విద్యాసంస్థ
చైర్మన్హరి ఎస్ భార్తియా
డైరక్టరుఎం చంద్రశేఖర్
విద్యాసంబంధ సిబ్బంది
50 [1]
స్థానంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
17°52′53″N 83°21′44″E / 17.8814°N 83.3622°E / 17.8814; 83.3622
కాంపస్సబర్బన్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (IIMV) విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ బిజినెస్ స్కూల్. ఇదొక జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థ. [2] దేశం మొత్తమ్మీద ఉన్న ఇరవై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లలో ఇది ఒకటి. ఈ సంస్థ తన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGP) కు చెందిన మొదటి బ్యాచ్‌ను 2015 ఆగస్టులో ప్రారంభించింది [3] విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద నగరం. ఈ నగరం విశాఖపట్నం జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. భారత నావికాదళానికి చెందిన తూర్పు నౌకాదళ కమాండ్ ఇక్కడే ఉంది. భౌగోళికంగా ఈ నగరం, తూర్పు కనుమల పర్వత శ్రేణికి, బంగాళాఖాతం తీరానికీ మధ్య ఉంది.

విద్యాకార్యక్రమాలు

[మార్చు]

ఈ ఇన్స్టిట్యూట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (PGP), కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ప్రవేశం పొందిన అభ్యర్థులకు అందించే ప్రధాన కార్యక్రమం.[4] ఇది రెండు సంవత్సరాల, పూర్తి-కాల రెసిడెన్షియల్ MBA ప్రోగ్రాం. ఇది ఒక పూర్తి సమీకృత మెనేజిమెంట్ కార్యక్రమం. ఇందులో అకౌంటింగ్, బిహేవియరల్ సైన్సెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, బిజినెస్ ఆపరేషన్స్, పబ్లిక్ పాలసీ, స్ట్రాటజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, జనరల్ మేనేజ్‌మెంట్‌లలో కోర్సులు ఉంటాయి. IIM విశాఖపట్నంలో వర్కింగ్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం రెండు సంవత్సరాల పార్ట్‌టైమ్ ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్‌ కూడా ఉంది.[5] 2019 నుండి, IIMV దాని గురువు IIMB మార్గదర్శకత్వంలో దాని డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (DBA) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. [6]

2023 లో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) వారి మేనేజ్‌మెంట్ ర్యాంకింగుల్లో ఐఐఎమ్‌ విశాఖపట్నం 29వ స్థానంలో ఉంది.  

క్యాంపస్, స్థానం

[మార్చు]
Gambhiram Campus
క్యాంపస్‌లో సాయంత్రం స్కైలైన్

ఐఐఎమ్ విశాఖపట్నం మొదట్లో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉండేది. శాశ్వత క్యాంపస్ నగర శివార్లలోని గంభీరంలో రానుంది. తాత్కాలిక క్యాంపస్‌లో తరగతి గదులు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మోడల్‌లో రూపొందించారు. ఎందుకంటే బోధనా పద్ధతి కేస్ స్టడీల ఆధారంగా ఉంటుంది. డీన్- ప్రోగ్రామ్స్ (IIM-B) అయిన సౌరవ్ ముఖర్జీ ప్రకారం, "ఈ సెమిసర్కిల్ గ్యాలరీ మోడల్ వలన, ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్య సంభాషణలు మెరుగ్గా ఉంటాయి". [7] శాశ్వత క్యాంపస్ కోసం భూసేకరణ దాదాపు పూర్తయింది. కొత్త క్యాంపస్‌కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ 2015 జనవరి 17 న శంకుస్థాపన చేసింది. 240 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. [8]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Faculty Details
  2. Correspondent, Special (8 Sep 2015). "IIM-V all set to start functioning". The Hindu. Retrieved 23 June 2016.
  3. Bhattacharjee, Sumit (25 June 2015). "IIM-Vizag to start classes from August". The Hindu.
  4. "IIM Visakhapatnam PGP Course Detail". Archived from the original on 2022-01-22. Retrieved 2023-12-10.
  5. IIM Visakhapatnam PGPEx Course Detail
  6. "IIM Visakhapatnam Doctor of Business Administrstion (DBA) programme detail". Archived from the original on 2021-12-07. Retrieved 2023-12-10.
  7. Bhattacharjee, Sumit (15 Sep 2015). "All 60 seats filled in IIM-Vizag, classes from September 21". The Hindu. Retrieved 23 June 2016.
  8. "IIM-Vizag to officially start sessions at AU today". Times of India. TNN. 21 Sep 2015. Retrieved 23 June 2016.