Jump to content

ఆవేటి నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
ఆవేటి నాగేశ్వరరావు
జననంఆగస్టు 1, 1914
మరణంసెప్టెంబర్ 26, 1967
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు
తల్లిదండ్రులువెంకటస్వామి, అంజనమ్మ

ఆవేటి నాగేశ్వరరావు (ఆగస్టు 1, 1914 - సెప్టెంబర్ 26, 1967) రంగస్థల నటుడు, దర్శకుడు, ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యుడు, వదాన్యుడు, నటరాజేంద్ర, నాట్య కళాధురీణ బిరుదాంకితుడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

నాగేశ్వరరావు 1914, ఆగస్టు 1 న వెంకటస్వామి, అంజనమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం, గుంటూరు లలో విద్యను అభ్యసించాడు. స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉత్తీరుడయ్యాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

నాగేశ్వరరావుది నాటక కళాకారుల కుటుంబం. భీమవరం, గుంటూరులో చదువుకుంటున్న రోజులలోనే వంశానుగతమయిన నాటకకళ అభిరుచితో, తనతోటి వాళ్లతో నాటకాలు వేసేవాడు. 1934, సెప్టెంబర్ 4న తండ్రి ఆధిపత్యంలో కుటుంబమంతా కలిసి ప్రదర్శించిన తులాభారం నాటకంతో రంగస్థలంపై అడుగుపెట్టాడు. నాగేశ్వరరావు, ఆవేటి పూర్ణిమ నాయకా నాయిక పాత్రలలో అనేక నాటకాలు ప్రదర్శించారు. మనస్పర్థల కారణంగా 1943లో అన్నదమ్ములు విడిపోయి, నాగేశ్వరరావు న్యూ పూర్ణానంద థియేటర్స్ పేరుతో మరో కొత్త సమాజం స్థాపించాడు. క్షణంలో దృశ్యం మారడానికి వీలయ్యే ట్రాలీ స్టేజీని మొట్టమొదటగా నాగేశ్వరరావే ప్రవేశపెట్టాడు. సురభి నాటక కళా సంఘం స్థాపించడంతోపాటు సురభి సప్తతి స్వర్లోత్సవాలు జరిపి, ప్రత్యేక సంచిక వెలువరించాడు.

నటించిన పాత్రలు

[మార్చు]

సత్కారాలు - గర్తింపులు

[మార్చు]
  1. 1959లో బాపట్ల విజ్ఞాన సమితి నాగేశ్వరరావుకు నట రాజేంద్ర అనే బిరుదునిచ్చి సన్మానించింది
  2. తెనాలి వర్తక సంఘం నాగేశ్వరరావు దంపతులకు కనకాభిషేకం చేసి, నవరత్నహారం బహూకరించింది
  3. గాలివీడు గ్రామంలో సువర్ణ ఘంటాకంకణం బహూకరించారు
  4. బలిదానం, శ్రీకృష్ణదేవరాయలు నాటకాలు ప్రదర్శనకు కావాలసిన లైటింగ్ మొదలైన పరికరాలు కొనుక్కోవడానికి భారత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం లభించింది

మరణం

[మార్చు]

నాగేశ్వరరావు 1967, సెప్టెంబర్ 26 న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.367.