ఆర్.సుబ్బలక్ష్మి
సుబ్బలక్ష్మి | |
---|---|
జననం | 1936 ఏప్రిల్ 21 |
మరణం | 2023 నవంబరు 30 తిరువనంతపురం, కేరళ, భారతదేశం | (వయసు 87)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి సంగీత స్వరకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 1951–2023 |
జీవిత భాగస్వామి | కళ్యాణకృష్ణన్ |
పిల్లలు | తారా కళ్యాణ్ |
ఆర్.సుబ్బలక్ష్మి (1936 ఏప్రిల్ 21 - 2023 నవంబరు 30) భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, స్వరకర్త, అంతేకాకుండా, ఆమె మలయాళ సినిమా నటి. కళ్యాణరామన్ (2002), పందిప్పాడ (2005), నందనం (2002) చిత్రాలలో ఆమె నటనకు గుర్తింపు పొందింది. ఆమె కూతురు తారా కళ్యాణ్ కూడా మలయాళ సినిమా నటి.
దాదాపు 75 సినిమాల్లో నటించిన ఆమె తమిళ నటుడు విజయ్ నటించిన బీస్ట్ (2022 ) సినిమాతోపాటు, తెలుగులో అక్కినేని నాగచైతన్య నటించిన ఏమాయ చేశావే (2010), 2003లో వచ్చిన కళ్యాణ రాముడు చిత్రాల్లోనూ నటించింది. వీటితోపాటు పలు సీరియళ్ళు, వాణిజ్య ప్రకటనల్లోనూ ఆమె నటించింది.
జీవిత చరిత్ర
[మార్చు]సుబ్బలక్ష్మి కళ్యాణకృష్ణన్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె చిన్న కుమార్తె తారా కళ్యాణ్ కూడా ప్రముఖ నటి, నృత్యకారిణి. సుబ్బలక్ష్మి, చలనచిత్రంలోకి రాకముందు, జవహర్ బాలభవన్‌లో సంగీత విద్వాంసురాలు, నృత్య శిక్షకురాలు. ఆమె 1951 నుండి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసింది. దక్షిణ భారతదేశం నుండి ఆల్ ఇండియా రేడియో మొదటి మహిళా స్వరకర్తగా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె అనేక కచేరీలు చేసింది. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా, ఆమె కొన్ని టెలిఫిల్మ్‌లు, ఆల్బమ్‌లలో నటించింది.
సుబ్బలక్ష్మి 2023 నవంబరు 30న 87 సంవత్సరాల వయసులో మరణించింది.[1][2]
మూలాలు
[మార్చు]'
- ↑ "ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, సీనియర్ నటి ఆర్ సుబ్బలక్ష్మి కన్నుమూత". Asianet News Network Pvt Ltd. Retrieved 2023-12-01.
- ↑ "సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి మృతి". www.ntnews.com. Retrieved 2023-12-01.
- 1936 జననాలు
- 2023 మరణాలు
- మలయాళ సినిమా నటీమణులు
- భారతీయ సినిమా నటీమణులు
- మలయాళ నేపథ్య గాయకులు
- భారతీయ మహిళా నేపథ్య గాయకులు
- భారతీయ టెలివిజన్ నటీమణులు
- మలయాళ టెలివిజన్ నటీమణులు
- భారతీయ మోడల్స్
- తమిళ టెలివిజన్ నటీమణులు
- తమిళ సినిమా నటీమణులు
- తెలుగు సినిమా నటీమణులు
- కన్నడ సినిమా నటీమణులు
- హిందీ సినిమా నటీమణులు
- తమిళ టెలివిజన్ నటీమణులు