Jump to content

ఆర్.ఎస్.హైమవతి

వికీపీడియా నుండి
ఆర్.ఎస్.హైమవతి
ఆర్.ఎస్.హైమవతి చిత్రం
జననం
ఆర్.ఎస్.హైమవతి

ఆగష్టు 15, 1942
నరసాపురం తాలూకా భీమవరం
ఇతర పేర్లుఆర్.ఎస్.హైమవతి
విద్యఉస్మానియా యూనివర్సిటీ నించీ డిగ్రీ
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
క్రియాశీల సంవత్సరాలు1981 నుండి ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత్రి,
జీవిత భాగస్వామిరెట్టి గంటి సీతా రామ సత్యనారాయణ రావు
పిల్లలుముగ్గురు పిల్లలు .ఇద్దరు అమ్మాయిలు ,ఒక అబ్బాయి.
తల్లిదండ్రులుకీ.శే. దీదువాను నరసింహారావు
కీ.శే.దీదువాను కామేశ్వరమ్మ

ఆర్.ఎస్.హైమవతి ప్రముఖ రచయిత్రి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

హైమావతి నరసాపురం తాలూకా భీమవరం గ్రామంలో ఆగష్టు 15 1942 న దీదువాను కామేశ్వరమ్మ, దీదువాను నరసింహారావు దంపతులకు జన్మించారు. వారి కుటుంబం మధ్యతరగతి వ్యవసాయకుటుంబం.ఆమెకు నలుగురు అక్కలు, ముగ్గురు అన్నలు ఉన్నారు.ఆమె వారి సహోదరులలో చివరిది.

విద్య

[మార్చు]

ఆడపిల్లకి చదువెందుకనే పాతకాలపు సాంప్రదాయాలవల్ల వారితండ్రి కుమారుల చదువులకోసం నరసాపురంలో కాపురంపెట్టినా వాళ్ళని చేర్చిన స్కూల్లో కుమార్తెలను చేరిస్తే డబ్బుకట్టాలి దండగ అని అప్పుడే పంచాయతీవారు ఆడపిల్లల చదువుల్ని ప్రోత్సహించేందుకు పెట్టిన జీతం కట్టక్కరలేని స్కూలులో జేర్చారు. అదీ వారి తల్లి ప్రోద్బలంతో జరిగింది. అక్కడ ఎనిమిదవ తరగతి పూర్తయ్యాక ఆడపిల్లల ప్రభుత్వవిద్యాలయంలో తొమ్మిదవతరగతిలోచేర్చారు. తరవాత కుటుంబంలో ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలూ ఎదురవడంవల్ల ఆమె చదవు ఆగిపోయింది . ఏడెనిమిది సంవత్సరాల తరవాత ఆంధ్రా మెట్రిక్లేషన్ ప్రైవేట్ గా చదివి పాసై ఎలాగో ఇంట్లో అందర్నీ ఒప్పించి నరసాపురం కాలేజీలో పి .యు .సిలో చేరడం జరిగింది . అప్పటికి అన్నలు ఉద్యోగంలో చేరడంవల్ల కాస్త ఆర్థిక ఇబ్బందులు సర్దుకున్నాయి.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1967 లో ఆమె వివాహం "రెట్టి గంటి సీతా రామ సత్యనారాయణ రావు"తో జరిగింది. ఆయన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో హైదరాబాదు, చెన్నై లలో వివిధ వృత్తులు చేపట్టి 1996లో రిటైరయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు .ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయి స్కూలుకి వెళ్ళడం మొదలెట్టాక తిరిగి బి ఎ ప్రైవేటుగా చదివి ఉస్మానియా యూనివర్సిటీ నించీ 1978లో డిగ్రీ తీసుకోడం జరిగింది.ఆ సమయంలో ఆమె భర్త అక్కడే ఉద్యోగం చేస్తూండేవారు.తరవాత చెన్నైకి తిరిగి బదిలీ కావడంతో చెన్నై వచ్చి వారు స్థిరపడడం జరిగింది.

రచయిత్రిగా

[మార్చు]

ఆమె కలంపట్టింది 1981లో! మొదటి కథ అప్పటి మహిళా మాసపత్రిక వనితలో (జూలై 1981) ఫొటోతో కూడిన పరిచయంతో ప్రచురింప బడింది. ఆకథకి నేపథ్యం స్వంత రెండవ అక్క జీవితమే! మూడు, నాలుగు సంవత్సరాల వయస్సులోవుండగా అక్కకి భర్తపోయి ఏడాది పిల్లవాడితో ఇంటికి రావడం, (అక్కవయస్సు అప్పుడు పద్దెనిమిది ) అక్క అస్తమానం ఏడుస్తూ ఉండడం, బ్రాహ్మణ కుటుంబంలో ఆనాటి ఆచారాలు చూస్తూ ఎదుగుతున్నకొద్దీ మనసు దహిస్తున్నా ఎమీచేయలేని పరిస్థితి. మనసులో ముద్రించుకుపోయిన అక్క విషాధ గాధే ఆకథ.

మూఢ నమ్మకాలతో మడులూ, ఆచారాల పేరిట జరుగుతున్న అన్యాయాలని ఎత్తి చూపడమే ద్యేయంగా చాలారచనలు సాగాయి. ఎక్కడఏ అన్యాయం కళ్ళ బడినా అది ఓ రచన సృష్టించందే ఆమెకి తోచేదికాదు. ఆవిధంగా వివిధ పత్రికలలో వచ్చిన కథలు, రేడియోలో ప్రసారమైన కథలు వందకి చేరుకుంటే. పదిహేడు నాటికలు ఆలిండియా రేడియోలో ప్రసార మయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పెట్టిన రకరకాల పోటీలలో ఒకనాటికకీ, ఒక జన్గిల్కీ బహుమతులు లభించాయి (2006లో). వివిధ పత్రికలలో వెలుగు చూసిన కవితలు ముఫైకి చేరుకోగా బాలజ్యోతి లాంటి పిల్లల పత్రికల్లో కథలు ఓపది దాటితే నాలుగైదు గేయాలు, ఓ నవల ప్రచురితమయ్యాయి. ఇక వ్యాసాలు వివిధ పత్రికలలో మొత్తం అరవై చేరుకున్నాయి. ఇక నవలలు మూడు వెలుగు చూశాయి. మూడూ కూడా ఆంధ్ర భూమి డైలీలో పోటీల్లో సాధారణ ప్రచురణకి ఎన్నికైనవే. ఇంచుమించు ప్రచురితమైన అన్నికథలువివిధ పోటీల్లో ఎన్నికైనవే.

మొత్తమ్మీద నవలలు 3.ఒక మినీ నవల, కథలు 100 .వ్యాసాలు 60 కవితలు 30.నాటికలు 18 వెలుగు చూశాయి. పిల్లల గేయాలు, కథలు, నవల కాక.

బహుమతులు

[మార్చు]
  • జబ్బు .మినీ కథ .వనిత .నవంబర్ 1987
  • మంగా!మంగా!కథ ఉగాది కథల పోటీలో ఆంధ్ర పత్రిక 20-7-1990
  • మానని గాయాలు .స్వాతి వీక్లీ ..30 -11 -1990
  • వివిధ వ్యాస రచన పోటీల్లో ఆంధ్రజ్యోతీ, ఆంధ్ర పత్రికలలో వచ్చాయి

నవలల వివరాలు

[మార్చు]
  • వంశోధ్ధారకుడు ...మినీనవల .వనితాజ్యోతి సెప్టెంబర్ 1992
  • అనుబంధాలు –ఆనందాలు ...ఆంధ్ర భూమి.. ..మంత్లీ జూలై 2009
  • ఓ ఇంటి భారతం ..ఆంధ్రభూమి .డైలీ ..28 -4 -2011నించీ జూన్ 13 -2011 వరకు
  • మాతృదేవోభవ ..ఆంధ్రభూమి ..డైలీ ..7 -7-2014నుండీ 11 -8 -2014వరకు

రచనలు

[మార్చు]

కథా సంపుటాలు

[మార్చు]
  1. ఆర్.ఎస్.హైమవతి కథలు
  2. కథాకుసుమాలు [2]
  3. కథామాలిక [3]

కథలు

[మార్చు]
  1. అంతరాలు
  2. అంతర్మథనం
  3. అంతస్తులు...
  4. అనుమానం...
  5. అపోహలు[4]
  6. అప్పగింత
  7. అమ్మబాబోయ్
  8. అసమానత
  9. అస్తమయం
  10. ఎదురీత
  11. ఒక ఉద్యోగిని స్వగతం
  12. ఒక మాట
  13. ఒకే న్యాయం
  14. ఔరా తాతా
  15. కొత్తచోటు
  16. గతస్మృతులు
  17. గుప్పిట
  18. జబ్బు
  19. డాక్టర్లూ జోహార్లు
  20. తరాలు అంతరాలు
  21. తలంటు
  22. దానం
  23. నాడు-నేడు
  24. నింగీ నేలా
  25. నీవారెవరు
  26. పరశురాముడు...
  27. పిచ్చిపిల్ల
  28. పురుషోత్తం పొదుపు
  29. పొరపాటా గ్రహపాటా
  30. ప్రశ్నార్ధకం
  31. బామ్మ...
  32. బామ్మగారి యాజ్ఞీకం
  33. మంగా.. మంగా..
  34. మనసులు
  35. మనిషి విలువ
  36. మహేశ్వరావు మార్కెటింగ్
  37. మానని గాయాలు
  38. రాశిఫలం
  39. లోకం తీరు...
  40. శంకర్రావూ శకునాలూ
  41. సంస్కారం
  42. సిక్స్ ఇన్ వన్

మూలాలు

[మార్చు]
  1. రచయిత: ఆర్ ఎస్ హైమవతి
  2. books of R.S. Hymavathi
  3. "KATHA MAALIKA by R.S.HYMAVATHI". Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-30.
  4. ఆర్.ఎస్.హైమవతి. "అపోహలు". కథాజగత్. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 July 2015.

ఇతర లింకులు

[మార్చు]