ఆరాంఘర్ ఫ్లైఓవర్
ఆరాంఘర్ హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు నూతనంగా ఈ ఫ్లైఓవర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను 2023 మార్చి నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.[1][2]
నిర్మాణ వివరాలు
[మార్చు]ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ప్రారంభమయ్యే ఈ ఫ్లైఓవర్ ను 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లలో 4.08 కిలోమీటర్ల పొడవుతో 636.8 కోట్లతో[3] స్టాటిజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) సౌజన్యంతో 2018లో నిర్మాణాన్ని ప్రారంభించారు.[4] ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే వారితోపాటు మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి, జూపార్క్‌కు వచ్చే సందర్శకులకు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం సులభతరం అవుతుంది.
పనుల పరిశీలన
[మార్చు]ఆరాంఘర్ నుండి జూపార్క్ వరకు 4.08 కిలోమీటర్ల నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ 2022 జనవరి 20న జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకే్‌షకుమార్, జీహెచ్ఎంసీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (20 January 2022). "2023 మార్చిలోపు ఆరాంఘర్- జూపార్క్ పైవంతెన". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
- ↑ Andhrajyothy (20 January 2022). "2023 మార్చిలోగా ఆరాంఘర్- జూపార్క్ ఫ్లై ఓవర్". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
- ↑ The Hans India (16 September 2021). "New 4-km long flyover to dot Zoo Park-Aram Ghar stretch" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2021. Retrieved 21 January 2022.
- ↑ The Times of India (20 January 2018). "Two flyovers in the pipeline to fix traffic woes, ensure hassle-free ride to airport" (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2018. Retrieved 21 January 2022.
- ↑ Namasthe Telangana (19 January 2022). "మార్చిలోగా ఆరాంఘర్ ఫ్లై ఓవర్." Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
- ↑ Sakshi (20 January 2022). "సాహోరే.. వారధులు! పాతబస్తీకే మణిహారాలు". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.