Jump to content

ఆపర్చునిటీ (రోవర్)

వికీపీడియా నుండి
ఆపర్చునిటీ

ఆపర్చునిటీ రోవర్ ఎమ్‌ఇఆర్-బి (మార్స్ ఎక్స్ప్‌లోరేషన్ రోవర్ - బి) లేదా ఎంఇఆర్-1 గా బాగా గుర్తింపు, ఇది 2004 నుండి అంగారక గ్రహంపై చురుకుగా ఉన్న ఒక రోబోటిక్ రోవర్. జూలై 7, 2003 న లాంచ్ అయి అంగారక గ్రహం యొక్క మెరిడియాని ప్లానం మీద గ్రౌండ్ యుటిసి ప్రకారం జనవరి 25, 2004 న 05:05 లకు (అంగారక స్థానిక సమయం 13:15) ఆపర్చునిటీ రోవర్ లాండ్ అయింది, మూడు వారాల తర్వాత దీని యొక్క ట్విన్ స్పిరిట్ (MER-A) నాసా యొక్క మార్స్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ మిషన్ భాగం కూడా గ్రహం యొక్క మరో వైపున కిందన తాకింది. 2009లో ఒకేచోట స్థిరంగా నిలబడిన స్పిరిట్ 2010లో సమాచారాన్నివ్వడం నిలిపివేసింది, ఆపర్చునిటీ ప్రణాళికా వ్యవధి 90 సోల్ (మార్టిన్ రోజులు) గడువును మించినా క్రీయాశీలకంగానే ఉంది. మూడు నెలల కాలంలో ఒక కిలోమీటరు దూరం మాత్రమే ప్రయాణించి భూమికి సమాచారాన్ని పంపేందుకే ఈ రోవర్ తయారు చేయబడింది, కానీ ఇది పదేళ్లు పూర్తయినా క్రీయాశీలకంగా నడుస్తూనే ఉంది. మార్స్‌పై ఈగల్ క్రేటర్ ప్రాంతంలో దిగి ఇప్పటివరకు 40 కిలోమీటర్లు పైన ప్రయాణించిన ఇది మరో రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ముఖ్యమైన ఎండీవర్ క్రేటర్ ప్రాంతానికి చేరనుంది.

రికార్డ్

[మార్చు]

అంగారక గ్రహంపై పది సంవత్సరాలుగా ఆగకుండా తిరుగుతున్న ఆపర్చునిటీ రోవర్ 2014లో 40 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించి అరుదైన రికార్డ్ సృష్టించింది. దీంతో భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై అత్యధిక దూరం ప్రయాణించిన రోవర్‌గా ఆపర్చునిటీ రోవర్ చరిత్రకెక్కింది.

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 30-07-2014 14వపేజి (రోవర్లలో మేటి... ఆపర్చునిటీ!)