Jump to content

ఆనంద్ భదౌరియా

వికీపీడియా నుండి
ఆనంద్ భదౌరియా
ఆనంద్ భదౌరియా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రేఖా వర్మ
నియోజకవర్గం ధౌరహ్రా

పదవీ కాలం
12 ఏప్రిల్ 2016 – 11 ఏప్రిల్ 2022
నియోజకవర్గం సీతాపూర్ జిల్లా (స్థానిక అధికారులు)

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
జీవిత భాగస్వామి అర్చన సింగ్ [1]
పూర్వ విద్యార్థి లక్నో యూనివర్సిటీ

ఆనంద్ భదౌరియా (జననం 1978) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధౌరహ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆనంద్ భదౌరియా సమాజ్ వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధౌరహ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2016లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికలలో సీతాపూర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీలంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3]

ఆనంద్ భదౌరియా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధౌరహ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రేఖా వర్మపై 4449 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "MLC आनंद भदौरिया पत्नी सहित कोरोना पॉजिटिव, हुए होम आइसोलेट". Navbharat Times.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Dhaurahra". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  3. TimelineDaily (31 January 2024). "Anand Bhadauria, The SP Candidate From Dhaurahra Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  4. The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.