Jump to content

ఆదిలాబాద్ రంజన్లు

వికీపీడియా నుండి

ఆదిలాబాద్ రంజన్లు తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరి వాడ రంజన్లలకు ప్రసిద్ధి.ఈ ఆదిలాబాద్ రంజన్లలను పేదవాడి రిఫ్రిజిరేటర్ గుర్తింపు ఉంది[1]. సహజ సిద్ధంగా తయారయ్యె ఈ రంజన్లకు దక్షిణ భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది[2][3][4][5].

ఆదిలాబాద్ జిల్లా రంజాన్లు .

రంజన్ల తయారీ

[మార్చు]

ఆదిలాబాద్ లోని కుమ్మరివాడలో సుమారు మూడు వందల కుటుంబాలు రంజన్లు తయారి చేస్తు తమ కుటుంబాలను పోషిస్తున్నాయి.వీరు గత అరవై సంవత్సరాల నుండి కుమ్మరి వృత్తిని నమ్ముకొని రంజన్లు,కుండలు,మట్టి పాత్రలు తయారీని జీవనాధారంగా మలచుకున్నారు.రంజన్ల తయారీ కోసం వీరు రెండు రకాల మట్టి అనగా నల్ల మట్టి,ఎర్రమట్టిని సేకరించి ఇంటి ఆవరణంలో ఎండబెట్టి అందులో ఉన్న రాళ్ళు,చెత్త చెదారాలను ఏరి దుడ్డుతో సన్నగా చూర్ణం చేస్తారు.నవంబరు, డిసెంబరు,నెలలో మహారాష్ట్రలోని వని,పాండర్ కవడా,ఘటాంజీ యావత్మాల్,చంద్రాపూర్, మొదలగు ప్రాంతాలకు వెళ్ళి గుర్రపు లద్దిని తీసుకోని వస్తారు.చూర్ణం చేసిన మట్టిలో ఐదు గుల్లల మట్టికి నాలుగు గుల్లల లద్ది ఒక గుల్ల బూడిద కలిపి మిశ్రమం చేసి అందులో సరిపోయె మోతాదులో నీరు కలిపి పిసికి పిసికి ఒక రోజంతా నిలవ ఉంచి అందమైన రంజన్లు తయారు చేస్తారు[6].

రంజన్ల ప్రత్యేకత

[మార్చు]

ఆదిలాబాద్ రంజన్ల[7] ప్రత్యేకత ఏమిటంటే వాటిని నిర్దుష్టమైన ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. కాల్చేటపుడు గుర్రపు లద్దిలోని గడ్డి సంబంధమైన చిన్న చిన్న సూక్ష్మ పదార్థాలు కాలి అదే స్థానంలో ఎక్కువగా సూక్ష్మరంధ్రాలు ఏర్పడుతాయి. ఆ సూక్ష్మరంధ్రాల ద్వారా నీరు బయటకు వచ్చి రంజన్లలను ఎల్లప్పుడు తేమగా ఉంచుడం వలన కొత్త రంజన్లలోని నీరు దీర్ఘకాలం చల్లగా ఉండడం ఈ రంజన్ల ప్రత్యేకత.

గిరాకీ ఎక్కువ

[మార్చు]

ఆదిలాబాద్ రంజన్లలను పేదవాడి ఫ్రిజ్ అని అంటారు[8]. రంజన్ల నీరు మట్టిలోని లవణాలను,ఖనిజాలను గ్రహించడం వలన నీరు ఎంతో రుచికరంగా ఉంటుంది. అందువలన ఎండాకాలం వచ్చిదంటే తెలంగాణలోని హైదరాబాద్ కు బస్సులు పై లారీల మీద పంపి అచటి నుండి ఇతర నగరాలకు,పట్టణాలకు వ్యాపారస్థులు అమ్ముతు ఉంటారు [9].ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర లలోని ప్రతి జిల్లాలోను ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి మండలంలోను ఆదిలాబాద్ రంజన్లు లారీలు,బస్సులతో చేరడంతో ఈ రంజన్లలకు బలే గిరాకీ ఉంటుంది[10].

మూలాలు

[మార్చు]
  1. "ఆదిలాబాద్‌ రంజన్‌లు... పేదవాడి రెఫ్రిజిరేటర్లు". BBC News తెలుగు. 2023-03-05. Retrieved 2024-07-16.
  2. "న‌వంబ‌ర్ వ‌న్‌..ఆదిలాబాద్ రంజ‌న్‌ - Adilabad ranjajn". telugunewstg.blogspot.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-16.
  3. "Adilabad Ranjan Buy Online | Matti Kundalu online". Adilabad Ranjan (in ఇంగ్లీష్). Retrieved 2024-07-16.
  4. "Adilabad Ranjan Buy Online | Matti Kundalu online". Adilabad Ranjan (in ఇంగ్లీష్). Retrieved 2024-07-16.
  5. "Telangana : పేదవాడి రిఫ్రిజిరేటర్లు ఈ రంజన్లు.. సమ్మర్ లో వీటికి ఫుల్ డిమాండ్..(వీడియో)". News18 తెలుగు. 2021-03-04. Retrieved 2024-07-16.
  6. TEAMHOH (2023-04-17). "Eco-friendly Ranjan clay pots loosing its charm – Humans Of Hyderabad" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-16.
  7. telugu, NT News (2024-04-02). "పేదోడి ఫ్రిజ్‌ రంజన్‌". www.ntnews.com. Retrieved 2024-07-16.
  8. Today, Telangana (2021-01-29). "Watch: All about Adilabad ranjans, the 'poor man's fridge'". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-16.
  9. India, The Hans (2018-04-07). "Adilabad 'Ranjans' now available in city". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-16.
  10. Telugu, TV9 (2021-04-02). "ఆదిలాబాద్ రంజాన్లకు భలే గిరాకీ.. నీటిని చల్లబరచడమే కాదు.. ఇంకా చాలా విషయాల్లో బెటర్‌.. ఏంటో తెలుసుకోండి." TV9 Telugu. Retrieved 2024-07-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)