ఆదిభట్ల ప్రత్యేక ఆర్థిక మండలి
ఆదిభట్ల Plots - | |
---|---|
Village Plots - | |
తెలంగాణలో స్థానం, India | |
Coordinates: 17°14′N 78°33′E / 17.233°N 78.550°E | |
దేశం | India |
రాష్ట్రం | తెలంగాణ |
Government | |
• తెలంగాణ ప్రభుత్వము | .. |
Elevation | 9,70,08,60,249 మీ (3.1826969321×1010 అ.) |
జనాభా (2001) | |
• Total | 1,800 |
భాషలు | |
• అధికారిక భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ఎస్టీడీ కోడ్ | 040 |
Vehicle registration | TS 07 |
జనాభా నిష్పత్తి | 1:1(approx) ♂/♀ |
Website | http://www.adibatla.org/ |
ఆదిభట్ల ప్రత్యేక ఆర్థిక మండలి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రాంతము. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వము ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించింది. ఆదిభట్ల గ్రామానికి సరిగ్గా నప్పుతుంది. ఐదేళ్ల క్రితం వరకూ అదో కుగ్రామం. ఎడ్లబండ్లు కూడా సరిగా తిరగని ఆ ఊళ్లో నేడు ఏకంగా విమానాల విడిభాగాలనే తయారు చేస్తున్నార.
పరిశ్రమలు
[మార్చు]విమానయాన పరిశ్రమ
[మార్చు]ఆదిభట్లలో 250 ఎకరాల్లో వైమానిక సెజ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి రూపురేఖలే మారిపోయాయి. ఇప్పటికే ఈ సెజ్‌లో టాటా సికోర్ స్కై, టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్, టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్, సమూహా ఏరోస్పేస్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ సంస్థ జర్మనీకి చెందిన రుమాగా సంస్థతో కలిసి డార్నియర్ విమాన పరికరాల తయారీ పరిశ్రమను స్థాపించింది. డార్నియర్-228 విమాన ప్రధాన భాగంతో పాటు విమాన రెక్కలను కూడా ఇక్కడ తయారు చేయనున్నారు. రెండో దశలో మొత్తం విమానాన్నే తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇదే జరిగితే దేశంలోనే తొలి విమాన తయారీ కేంద్రంగా ఆదిభట్ల ప్రపంచ చరిత్రలో నిలుస్తుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ
[మార్చు]ఆదిభట్లలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడానికి గతంలోనే ప్రభుత్వం భూములను కేటాయించింది. అందులో విమానయాన సంస్థలకు కొంత భూమిని కేటాయించగా.. మిగిలిన 180 ఎకరాల్లో కాగ్నిజెంట్, టీసీఎస్, ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ వంటి బహుళజాతి సంస్థలకు భూములను కేటాయించింది. దీనికితోడు ఆదిభట్లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) గా కూడా కేంద్రం ప్రకటించింది.
క్లస్టర్ -2లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) లలో 79.2 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్‌ను విస్తరించనున్నారు. దీంతో ఎంఏటీఏఆర్ టెక్నాలజీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఎన్‌ఈసీ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఎన్‌కేఎం టెక్నాలజీ వంటి కంపెనీలు పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న టీసీఎస్‌లో సుమారు 50 ఐటీ సంస్థల భవనాలను నిర్మిస్తున్నారు. ఐటీఐఆర్, ఏరోస్పేస్ సెజ్‌లు, కారిడార్లతో ఆదిభట్లకు లక్షకు పైచిలుకు ఉద్యోగాలోస్తారని అంచనా.