Jump to content

ఆదిత్య రాయ్ కపూర్

వికీపీడియా నుండి
ఆదిత్య రాయ్ కపూర్
2023లో ఆదిత్య రాయ్ కపూర్
జననం (1985-11-16) 1985 నవంబరు 16 (వయసు 39)
విద్యసెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

ఆదిత్య రాయ్ కపూర్ (జననం 16 నవంబరు 1985) ప్రముఖ బాలీవుడ్ నటుడు. మొదట చానల్ వి లో వీడియో జాకీగా పనిచేసేవారు. లండన్ డ్రీమ్స్(2009) సినిమాలో ఓ చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన ఆదిత్య యాక్షన్ రీప్లే(2010), గుజారిష్(2010) సినిమాల్లో సహాయ నటునిగా నటించారు. 2013లో ఆషికి 2 సినిమాతో హీరోగా మారారు.  ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత యే జవాహీ హై దివాని సినిమాలో సహాయ నటునిగా కనిపించారు. ఈ సినిమా భారి విజయాన్ని నమోదు చేసుకుంది. అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా కూడా నిలిచింది.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

16 నవంబరు 1985లో పంజాబీ హిందూ కుటుంబంలో ముంబైలో  జన్మించారు ఆదిత్య.[1] ఆయన తండ్రి పంజాబీ, తల్లి భారతీయ యూదు మతస్థురాలు.[2] ముగ్గురు అన్నదమ్ముల్లో ఆదిత్య ఆఖరివారు. ఆదిత్య పెద్ద అన్నయ్య సిద్దార్ధ్ రాయ్ కపూర్ యూటివి మోషన్ పిక్చర్స్ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారి, రెండో అన్నయ్య కునాల్ రాయ్ కపూర్ కూడా నటుడే.[3] ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఆదిత్య పెద్ద  అన్నయ్య  సిద్దర్ధ్ రాయ్ కపూర్ ను వివాహం చేసుకున్నారు.

ఆయన తాత రఘుపతి రాయ్ కపూర్ సినీ నిర్మాత.[4][5] ఆదిత్య తాత, అమ్మమ్మ ప్రముఖ నాట్యకళాకారులు. భారతదేశానికి సామా నాట్యాన్ని పరిచయం చేసింది వీరే.[4] ముంబైలోని కుఫే పరేడ్ లో జి.డి.సోమానీ మెమోరియల్ స్కూల్ లోనూ, సెయింట్ గ్జేవియర్స్ కళాశాలలోనూ చదువుకున్నారు ఆదిత్య.[4]

నటనలో ఎటువంటి శిక్షణా తీసుకోని ఆదిత్య, నాట్యంలోనూ, వాచకంలోనూ శిక్షణ తీసుకున్నారు. ఆయనకు నటునిగా అవ్వాలనే బలమైన కోరిక లేకపోయినా లండన్ డ్రీమ్స్ సినిమాకు ఆడిషన్స్ కు వెళ్ళిన తరువాత నటనపై శ్రద్ధ పెరిగింది. చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలనే కోరిక ఉన్నా 6వ తరగతి తరువాత క్రికెట్ శిక్షణా తరగతులకు వెళ్ళడం మానేశారు ఆదిత్య.

కెరీర్

[మార్చు]

తొలి చిత్రం, కెరీర్ లో ఒడిదుడుకులు (2009–2010)

[మార్చు]

మ్యూజిక్ చానెల్ అయిన చానెల్ వి లో వీడియో జాకీగా కెరీర్ ప్రారంభించారు ఆదిత్య. ప్రత్యేకమైన వాక్ శైలి, కామెడీ టైమింగ్ ఆయన షోలను హిట్ అయ్యేలా చేశాయి. 2009లో విపుల్ షా దర్శకత్వంలో లండన్ డ్రీమ్స్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారాయన. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ లతో కలసి నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాయ్ నటించిన యాక్షన్ రీప్లే లో ఆదిత్య సహాయ నటునిగా చేశారు. ఈ సినిమా కూడా హిట్ కాలేదు. ఆ తరువాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన గుజారిష్(2010) సినిమాలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ లతో కలసి సహాయ నటునిగా నటించారు. ఈ సినిమా కూడా విజయం సాధించలేదు.

కెరీర్ లో మలుపు (2013)

[మార్చు]
Aditya Roy Kapur and Shraddha Kapoor smiles for the camera
ఆషికి 2 సినిమా విజయోత్సవ సభలో నటి శ్రద్ధాకపూర్ తో ఆదిత్య.

2013లో మోహిత్ సూరి దర్శకత్వంలో విడుదలైన ఆషికి 2 సినిమాతో ఆదిత్య కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం కావడమే కాక, విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆదిత్య నటనకు కూడా పలువురు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.[6] 2013లో ఈ సినిమా అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఆ తరువాత రణబీర్ కపూర్, దీపికా పడుకోణె లు ప్రధాన  పాత్రధారులుగా నటించిన  యే జవానీ హై దివానీ(2013)  సినిమాలో సహాయనటునిగా కనిపించారు ఆదిత్య. ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ లభించింది. 2013 సంవత్సరానికిగానూ ఈ సినిమా 4వ అతి  ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.

2014లో హబిబ్ ఫైసల్ దర్శకత్వంలో పరిణీతి చోప్రా తో కలసి దావత్-ఎ-ఇష్క్ సినిమాలో నటించారు ఆదిత్య

హాలీవుడ్ సినిమా గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ కు హిందీ రీమేక్ అయిన ఫితూర్ సినిమాలో కత్రినా కైఫ్, టబు లతో కలసి నటించారు ఆదిత్య. ఈ సినిమా జనవరి 2016 కల్లా షూటింగ్ పూర్తిచేసుకుంది.[7] ప్రస్తుతం తమిళ్ సినిమా ఓ కాదల్ కణ్మణి(తెలుగులో ఓకే బంగారం) సినిమాకు  హిందీ రీమేక్ ఓకే జానూ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో  ఆదిత్య తో కలసి శ్రద్ధ కపూర్ నటించనున్నారు.[8]

సినిమాలు

[మార్చు]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర
2009 లండన్ డ్రీమ్స్ వసిం ఖాన్
2010 యాక్షన్ రీప్లే బంటి
గుజారిష్ ఒమర్ సిద్దికీ
2013 ఆషికి 2 రాహుల్ జయకర్
యే జవానీ హై దివానీ అవినాష్ "అవి" అరోరా
2014 దావత్-ఎ-ఇష్క్ తరిక్ "తారూ" హైదర్
2016 ఫితూర్ నూర్ నైజామీ
2017 ఓకే జానూ
2020 మలంగ్
సంవత్సరం పురస్కారం చిత్రం ఫలితం
2013 బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డులు ఆషికి 2 గెలిచారు[9]
బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్ ఫర్ ది మోస్ట్ రొమాంటిక్ అవార్డ్ ఫర్ 2013 (శ్రద్ధ కపూర్ తో కలసి) గెలిచారు[9]
2014 స్క్రీన్ అవార్డ్ ఫర్ జోడి నెం.1 (శ్రద్ధకపూర్ తో కలసి) గెలిచారు[10]
స్టార్ గిల్డ్ అవార్డ్ ఫర్ జోడి ఆఫ్ ది ఇయర్ (శ్రద్ధ కపూర్ తో కలసి) గెలిచారు[11]
ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం యే జవానీ హై దివానీ నామినేషన్[12]
ఐఫా ఉత్తమ సహాయనటుడు అవార్డు గెలిచారు[13]

References

[మార్చు]
  1. "Birthday Exclusive: Aditya Roy Kapur". Deccan Chronicle. 26 November 2013. Retrieved 12 February 2014.
  2. "Shraddha and I are really, really close: Aditya Roy Kapur". The Times of India. 26 May 2013. Archived from the original on 19 October 2013. Retrieved 11 June 2013.
  3. "Born to Sweet Delight". Tehelka. 22 June 2013. Archived from the original on 16 September 2013. Retrieved 15 June 2013.
  4. 4.0 4.1 4.2 "Another GenNext Kapur family finds feet in Bollywood". The Economic Times. 20 Nov 2010. pp. 1–2. Retrieved 15 June 2013.
  5. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో G. Rakesh పేజీ
  6. Chopra, Anupama (26 April 2013). "Anupama Chopra's review: Aashiqui 2". Hindustan Times. Archived from the original on 30 May 2013. Retrieved 4 Aug 2014.
  7. "Aditya Roy Kapur worked hard to play Kashmiri in 'Fitoor': Abhishek Kapoor". The Indian Express. 30 January 2016. Retrieved 27 January 2016.
  8. "Aashiqui 2 lovers – Aditya Roy Kapur and Shraddha Kapoor reunite for another romance". The Times of India. 17 November 2015. Retrieved 17 November 2015.
  9. 9.0 9.1 "Big Star Entertainment Awards 2013 – List of winners". truthdive.com. Archived from the original on 19 December 2013. Retrieved 19 December 2013.
  10. "20th Annual Life OK Screen Awards: List of winners". The Indian Express. 15 January 2014. Retrieved 17 January 2014.
  11. "Winners of 9th Renault Star Guild Awards". Bollywood Hungama. 17 January 2014. Retrieved 17 January 2014.
  12. "59th Filmfare Awards: Nominations' Full List". koimoi.com. Archived from the original on 23 డిసెంబరు 2014. Retrieved 4 March 2014.
  13. Bhowmik, Arijita (27 April 2014). "IIFA Awards 2014: Deepika Padukone, Farhan Akhtar, 'Bhaag Milkha Bhaag' Take Away Major Honours [Full Winner's List]". International Business Times. Retrieved 27 April 2014.