Jump to content

ఆదాయపు పన్ను శాఖ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
ఆదాయపు పన్ను శాఖ క్రికెట్ జట్టు
cricket team
క్రీడక్రికెట్ మార్చు
దేశంపాకిస్తాన్ మార్చు

ఆదాయపు పన్ను శాఖ క్రికెట్ జట్టు అనేది పాకిస్తాన్ దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. 1975 నుండి 1979 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడింది, ప్యాట్రన్స్ ట్రోఫీలో పోటీపడింది.[1]

ఫస్ట్ క్లాస్ రికార్డు

[మార్చు]

ఆదాయపు పన్ను శాఖ నాలుగు సీజన్లలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది, ఒకటి గెలిచింది, మూడు ఓడిపోయింది, నాలుగు డ్రా చేసుకుంది. 1977-78లో, పెషావర్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత,[2] వారు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు, అక్కడ హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ చేతిలో ఓడిపోయారు, వీరి కోసం అర్షద్ పర్వేజ్, మొహ్సిన్ ఖాన్ రెండో వికెట్‌కు 426 పరుగులు జోడించారు.[3]

అత్యుత్తమ ప్రదర్శనలు

[మార్చు]

సాదత్ అలీ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు, 62.80 సగటుతో 942 పరుగులు,[4] 30.29 సగటుతో 17 వికెట్లు తీశాడు.[5] ఇతను 1976–77లో బహవల్‌పూర్‌పై జట్టు అత్యధిక స్కోరు 277 చేశాడు.[6] 1977-78లో లాహోర్ ఎ కి వ్యతిరేకంగా సౌద్ ఖాన్ 82 పరుగులకు 8 వికెట్లు (మ్యాచ్‌లో 165 పరుగులకు 13) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.[7]

ప్రముఖ ఆటగాళ్లు

[మార్చు]

ప్రస్తుత స్థితి

[మార్చు]

ఆదాయపు పన్ను శాఖ జట్లు సబ్-ఫస్ట్-క్లాస్ స్థాయిలో ఆడటం కొనసాగించాయి. వారు పాట్రన్స్ ట్రోఫీ గ్రేడ్ IIలో పోటీపడతారు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Extraordinary leagues of gentlemen". ESPN Cricinfo. Retrieved 2 June 2020.
  2. Income Tax Department v Peshawar 1977-78
  3. Habib Bank Limited v Income Tax Department 1977-78
  4. Saadat Ali batting by team
  5. Saadat Ali bowling by team
  6. Bahawalpur v Income Tax Department 1976-77
  7. Income Tax Department v Lahore A 1977-78
  8. "Other matches played by Income Tax Department at CricketArchive". Archived from the original on 2020-04-12. Retrieved 2017-09-09.

బాహ్య లింకులు

[మార్చు]