Jump to content

ఆటిజం

వికీపీడియా నుండి
అటిజం
పిల్లవాడు కానులు పదే పదే సర్దుతున్నాడు. ఇది ఆటిజం లక్షణం
ప్రత్యేకతసైకియాట్రి
లక్షణాలుఇంటర్ పర్సనల్ రిలేషన్, బలహీనమైన పరిమితం చేయబడిన ఆసక్తులు, పునరావృత ప్రవర్తన, ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతల నిర్ధారణ జీవితంలో మొదటి 3 సంవత్సరాలు
సంక్లిష్టతలుసమాజంలో కలవలేక పోవడం, ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు వంటివి
సాధారణ ప్రారంభం3 సంవత్సరాలలో
కాల వ్యవధిదీర్ఘకాలికమైనది
కారణాలుజన్యుపరమైనవి, పర్యావరణ కారకాలు
రోగనిర్ధారణ పద్ధతిప్రవర్తన, వివిధ స్థాయిలలో అభివృద్ధి
చికిత్సబిహేవియర్ చికిత్స, స్పీచ్ చికిత్స, మందులు
తరుచుదనము24.8 మిలియన్ (2015 నాటికి)

ఆటిజం పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగించే ఒక రుగ్మత. ఇది శారీరక, సామాజిక, భాషా నైపుణ్యాలను అభివృద్ధిని ప్రభావితం చేసే రుగ్మత దీని వలన పరిమితం చేయబడిన, పునరావృత ప్రవర్తన వలన సమాచారం అందచేయడంలో, అందుకోవడం లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు వారి పిల్లలలో ఈ లక్షణాలను, సంకేతాలను మొదటి మూడు సంవత్సరాలలోనే గమనించగలరు[1]. అయితే ఈ లక్షణాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి, ఆటిజం రుగ్మత ఉన్న కొంతమంది పిల్లలు సాధారణ అభివృద్ధి స్థాయి, మైలురాళ్లను చేరుకున్న తర్వాత వారి సంభాషణ తీరు, సామాజిక నైపుణ్యాలు మరింత అధ్వాన్నంగా తయారవుతాయి[2].

ఆటిజం (గ్రీకు ఆటోస్ నుండి, "స్వీయ" అని అర్ధం) అనే పదాన్ని 1911లో స్విస్ మానసిక వైద్యుడు యూజెన్ బ్ల్యూలర్ ఉపయోగించారు, అతను స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న ఒక వ్యక్తి అంతర్గత ప్రపంచంలోకి ఉపసంహరించుకోవడాన్ని వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగించాడు. ఆస్ట్రియాలో జన్మించిన అమెరికన్ మానసిక వైద్యుడు లియో కన్నెర్ ఈ డిజార్డర్‌ను స్కిజోఫ్రెనియా నుండి వేరుగా గుర్తించాడు. 1943లో ఈ పరిస్థితిని వివరించడానికి ఆటిజం అనే పదాన్ని ఉపయోగించాడు.

ఆటిజంను చారిత్రాత్మకంగా, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ (ASDలు) సమూహంలో వర్గీకరించారు. ఇందులో ఆస్పెర్జర్ సిండ్రోమ్, పేర్వాసివ్ డెవలప్‌మెంటల్ డిజార్డర్ నాట్ అదర్ వైస్ స్పెసిఫైడ్ (PDD-NOS), రెట్ సిండ్రోమ్, బాల్య విచ్ఛిన్న రుగ్మత (Childhood Disintegrative Disorder) కూడా ఉన్నాయి. 2013లో, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5) ఐదవ కూర్పు ప్రచురణతో, ఈ ఆటిజం, ASD వివిధ రూపాల ఒకటిగా నిర్ధారించారు[3].

కారకాలు

[మార్చు]

ఆటిజం రుగ్మత కు కారణం ముఖ్యంగా వంశపారంపర్యంగను (జన్యు ), పర్యావరణ కారకాల కలయిక గా పేర్కొంటారు. ప్రమాద కారకాలలో ముఖ్యంగా తల్లి గర్భధారణ సమయంలో రుబెల్లా వంటి కొన్ని అంటువ్యాధులకు గురిఅవడం, వాల్ప్రోయిక్ ఆమ్లం, మద్యం, కొకైన్, పురుగుమందులు, సీసం, వాయు కాలుష్యం, పిండం పెరుగుదల పరిమితి, స్వయం ప్రతిరక్షక వ్యాధులు (ఆటో ఇమ్యూన్ వ్యాధులు) ఉన్నాయి[4][5][6]. ఈ ఇతర పర్యావరణ కారకాల గురించి వివాదాలు కూడా ఉన్నాయి, ఉదాహరణకి - టీకా పరికల్పన (హైపోథీసిస్) నిరూపించబడలేదు[7]. ఆటిజం, మెదడులోని సమాచార ప్రసార ప్రక్రియను ప్రభావితం చేస్తుంది నరాల కణాలు వాటి సినాప్సెస్ (సినాప్స్ అంటే నాడీ వ్యవస్థలో ఒక న్యూరాన్ (లేదా నాడీ కణం) ఒక విద్యుత్ లేదా రసాయన సంకేతాన్ని మరొక న్యూరాన్‌కు లేదా లక్ష్య కణానికి పంపడానికి అనువైన ఒక నిర్మాణం) ఎలా అనుసంధానమవుతాయి, నిర్వహించబడతాయి ఇది ఎలా సంభవిస్తుందో అనే విషయంలో స్పష్టత లేదు[8]. మానసిక రుగ్మతల డయాగ్నొస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ (DSM-5), ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) రోగ నిర్ధారణలో ఆటిజం పరిస్థితిని ఆస్పెర్గర్ సిండ్రోమ్, PDD-NOS లతో మిళితం చేసి చూస్తుంది[9].

ప్రారంభంలో పిల్లల ప్రవర్తన సరిదిద్దడం లేదా మాట్లాడడంలో (ప్రసంగ) చికిత్స ఇవ్వడం వంటివి ఆటిజంతో ఉన్న పిల్లలకు స్వయంగా తమను సంరక్షణ చేసికోవడంలో , సామాజిక సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో సహాయపడుతుంది. దీనికి నిర్దుష్టంగా నివారణ లేనప్పటికీ, పిల్లలు కోలుకున్న కేసులు ఉన్నాయి. కొంతమంది ఆటిజం తో ఉన్నవాళ్లు పెద్ద అయినా స్వతంత్రంగా జీవించలేరు. కొంతమంది వ్యక్తులు చికిత్స కోసం ప్రయత్నిస్తుంటే, ఇతరులు ఆటిజంను నయం చేయడానికి బదులుగా దీనిని ఒక వ్యత్యాసంగా అంగీకరించాలని నమ్ముతున్నారు. అందువలన ఆటిస్టిక్ సంస్కృతి అనేది కూడా అభివృద్ధి చెందింది[10].

అటిజం వ్యాప్తి

[మార్చు]

2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా, ఆటిజం 24.8 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు. 2000లలో, ప్రతి 1,000 మందికి 1 నుండి 2 మంది బాధితుల సంఖ్య ఉన్నట్లు అంచనా వేయబడింది[11]. 2017 నాటికి అభివృద్ధి చెందిన దేశాలలో సుమారు 1.5% మంది పిల్లలు ASD తో బాధపడుతున్నారు, అమెరికాలో 2000 లో 0.7% మంది [12]. ఇది స్త్రీల కంటే పురుషులలో నాలుగు నుండి ఐదు రెట్లు ఎక్కువగా సంభవిస్తుంది అని తెలుస్తోంది. 1960ల నుండి రోగ నిర్ధారణ చేయబడిన వ్యక్తుల సంఖ్యగణనీయంగా పెరిగింది, ఇది పాక్షికంగా రోగనిర్ధారణ పద్ధతిలో మార్పుల కారణంగా కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ శాతం పెరిగిందా అనేది పరిష్కారం కాని ప్రశ్న.[13]

సూచనలు

[మార్చు]
  1. Bonati M, Cartabia M, Clavenna A (January 2022). "Still too much delay in recognition of autism spectrum disorder". Epidemiology and Psychiatric Sciences. 31 (e1). Cambridge University Press: e1. doi:10.1017/S2045796021000822. LCCN 2011243374. OCLC 727338545. PMC 8786613. PMID 35012703. S2CID 245851335.
  2. . "Regression in autistic spectrum disorders".
  3. Blatt, Gene. "autism". Encyclopedia Britannica, 1 May 2024, https://www.britannica.com/science/autism. Accessed 2 May 2024
  4. . "Prenatal factors associated with autism spectrum disorder (ASD)".
  5. . "Neurodevelopment: The Impact of Nutrition and Inflammation During Preconception and Pregnancy in Low-Resource Settings".
  6. . "Pathophysiology of autism spectrum disorders: revisiting gastrointestinal involvement and immune imbalance.".
  7. . "Incidence of autism spectrum disorders: changes over time and their meaning".
  8. . "Autism".
  9. . "Identification and evaluation of children with autism spectrum disorders".
  10. Frith, Uta (October 2014). "Autism – are we any closer to explaining the enigma?". The Psychologist. Vol. 27. British Psychological Society. pp. 744–745. Archived from the original on 2019-05-10. Retrieved 2020-08-06.
  11. Newschaffer CJ, Croen LA, Daniels J, Giarelli E, Grether JK, Levy SE, Mandell DS, Miller LA, Pinto-Martin J, Reaven J, Reynolds AM, Rice CE, Schendel D, Windham GC (2007). "The epidemiology of autism spectrum disorders". Annual Review of Public Health. 28: 235–258. doi:10.1146/annurev.publhealth.28.021406.144007. PMID 17367287.
  12. Lyall K, Croen L, Daniels J, Fallin MD, Ladd-Acosta C, Lee BK, Park BY, Snyder NW, Schendel D, Volk H, Windham GC, Newschaffer C (March 2017). "The changing epidemiology of autism spectrum disorders". Annual Review of Public Health. 38: 81–102. doi:10.1146/annurev-publhealth-031816-044318. PMC 6566093. PMID 28068486.
  13. "ASD data and statistics". CDC.gov. Archived from the original on 18 April 2014. Retrieved 11 July 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆటిజం&oldid=4315893" నుండి వెలికితీశారు