ఆజాద్ హింద్ ఫౌజ్ ఖజానా వివాదం
సుభాష్ చంద్ర బోస్ ఆఖరి ప్రయాణంలో అతనితో ఉన్న ఆజాద్ హింద్ నిధిని ఆ సంస్థకు చెందిన వక్తులు దుర్వినియోగం చేసిన వృత్తాంతమే INA నిధి వివాదం. ఫార్మోసా (ప్రస్తుత తైవాన్) లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో బోసు మరణించాక, బోస్ వస్తువుల నుండి గణనీయమైన మొత్తంలో బంగారు ఆభరణాలు, రత్నాలను జపాన్‌లో నివసిస్తున్న ఆజాద్ హింద్ నేతల వద్దకు తీసుకువెళ్లారు. [1] స్వాధీనం చేసుకున్న నిధిలో కొంత భాగాన్ని స్వంతానికి వాడేసుకుంటున్నట్లు ఆరోపణలున్న అనేక మంది వ్యక్తుల గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయబడింది. అయితే, టోక్యోలోని భారతీయ దౌత్యవేత్తలు పదేపదే హెచ్చరించినప్పటికీ, ఆజాద్ హింద్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను నెహ్రూ పట్టించుకోలేదు. వీరిలో కొందరైతే నెహ్రూ ప్రభుత్వ ఆమోదంతో పదేపదే జపాన్‌కు వెళ్లారు. తరువాతి కాలంలో నెహ్రూ రాజకీయ ఆర్థిక ఎజెండాను అమలు చేసే ప్రభుత్వ అధికార బాధ్యతలను కూడా వీరికి ఇచ్చారు. [1] ఆరోపించిన నిధిలో చాలా తక్కువ భాగాన్ని 1950 లలో భారతదేశానికి తిరిగి పంపారు. [1]
డాక్యుమెంటరీ
[మార్చు]- హిస్టరీ TV18 ఛానెల్ ద్వారా 'నేతాజీ బోస్ - ది లాస్ట్ ట్రెజర్' డాక్యుమెంటరీ. [2]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆజాద్ హింద్ ఫౌజ్
- సుభాష్ చంద్రబోస్ మరణం
- INA అమరవీరుల స్మారక చిహ్నం
- సింగపూర్‌లో ఇండియన్ నేషనల్ ఆర్మీ
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Kavitha Muralidharan. "Who shrunk Netaji's fortune?". India Today. Retrieved 2015-09-19.
- ↑ "'Netaji Bose - The Lost Treasure'". HISTORY TV18 (in ఇంగ్లీష్). Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 23 January 2020.