Jump to content

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ

వికీపీడియా నుండి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాటక, నాట్య, సంగీత కళలకు తరుగుతున్న ఆదరణ దృష్ట్యా వాటి అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినదే సంగీత నాటక అకాడమీ. దీనిని 1957 లోనే సాహిత్య అకాడమీ తదనంతరం స్థాపించారు. రవీంద్ర భారతి ఈ అకాడమీకి చెందినదే.[1]

నృత్య, సంగీత, నాటకోత్సవాలను నిర్వహించడం, ఆయా కళలలో శిక్షణాలయ్హాలను సాంస్కృతిక సంస్థలకు, నిస్సయాయ స్థితిలో గల వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం చేయడం, మరుగున పడిఫోతున్న మన సాంప్రదాయ, జానపద కళారూపాల పునర్వికాసానికి కృషిచేయడం మున్నగు కార్యక్రమాలతో పాటు ఆయా రంగాలలో పరిశోధన చేయించి, గ్రంథాలు ప్రచురించే కార్యూక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ చేపట్తింది. ఈ పథకం కింద సంస్కృతంలోని ప్రామాణిక సంగీత, నృత్య శాస్త్ర గ్రంథాలను అనువదించజేసి ప్రచురిస్తుంది. ఇంతవరకు "సంగీత రత్నాకరం" మొదటి భాగం, "వృత్త రత్నావళి" "భావ ప్రకాశనము" అనే గ్రంథాలను కూడా ప్రచురించింది.[2]

విధులు

[మార్చు]
  • నాటకం, నాట్యం, సంగీతం, జానపద కళలు వంటి వాటిలో శిక్షణ
  • ఈ కళలలో విశేష కృషి జరుపుతున్న వారికి తగిన ప్రోత్సాహం
  • ఈ కళలను పరిశోధించుటకు, కళల యొక్క ప్రచురణలకు ఆర్థిక సహాయం అందించడం
  • ఈ కళల ద్వారా ప్రజలమధ్య సత్సంబంధాలు ఏర్పరచడం

కార్యక్రమాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్వర్యంలో 1975 ఏప్రిల్ 12న రాక్షననాం ఉగాది నుండి వారం రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ సభలను అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకళరావు, విద్యాశాఖామంత్రి మండలి వెంకట కృష్ణంరావు గార్లు అధ్యక్ష, నిర్వాహాధ్యక్షులుగా ఒక సంఘం ఏర్పడింది. ఈ సంఘం ప్రపంచ మహాసభలకు నాందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలలోనూ, ఢిల్లీలోను సంగీత, నాటక, నృత్య, జానపద కళోత్సవాలను నిర్వహించే బాధ్యతను, ఆయ రంగాలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించే బాధ్యతను సంగీత నాటక అకాడమీకి అప్పగించడం జరిగింది. అందులో భాగంగా విజయవాడలో నాటకోత్సవాన్ని, అనంతపురంలో వీధినాటకం సదస్సును, నిజామాబాదులో నృత్యోత్సవాన్ని, తిరుపతిలో సంగీతోత్సవాన్ని, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ జానపద, నాటక కళోత్సవాన్ని ఈ అకాడమీ నిర్వహించింది. ఈ సందర్భంగా సంగీత, నృత్య, నాటక, చలన చిత్రాలకు సంబంధించిన గ్రంథాలను ప్రచురించింది. వాటిలో "మన వాగ్గేయకారులు తొలి సంకీర్తన కవులు" అనే గ్రంథం ఒకటి.[3]

ఇంకా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Pages - Modern". web.archive.org. 2010-01-24. Archived from the original on 2010-01-24. Retrieved 2021-04-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "సంగీత సంప్రదాయాల ప్రదర్శిని" (PDF). ibiblio.org. 1976-11-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "మన వాగ్గేయకరులు - తొలి సంకీర్తన కవులు - పుస్తకం ముందుమాట" (PDF). tirumala.org. 1975-04-01.{{cite web}}: CS1 maint: url-status (link)