Jump to content

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త

వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటు1983
అధికార పరిధి నిర్మాణం
Federal agency[[ భారతదేశం]]
కార్యకలాపాల అధికార పరిధి[[ భారతదేశం]]
సాధారణ స్వభావం
ప్రధాన కార్యాలయంH. No: 96/3-72-124-1, Prasad'S complex, santosh nagar, kurnool .
ఏజెన్సీ అధికారులు
  • జస్టిస్ పి.లక్ష్మణ్‌ రెడ్డి
వెబ్‌సైట్
https://www.lokayukta.ap.nic.in/

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తుల అవినీతి, అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త చట్టం నవంబర్ 1 , 1983 నుంచి అమల్లోకి వచ్చింది.[1] ఆంధ్రప్రదేశ్ లో లోకాయుక్తతోపాటు, ఉప లోకాయుక్త వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.

లోకాయుక్త నియామకం, పదవీకాలం

[మార్చు]
  1. హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని 'లోకాయుక్త గా నియమిస్తారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ లోకాయుక్తను నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు.
  2. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 5 మంది జిల్లా న్యాయమూర్తుల్లో ఒకరిని 'ఉప లోకాయుక్త గా గవర్నర్ నియమిస్తారు.
  3. లోకాయుక్త పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. పదవీకాలం అనంతరం తిరిగి ఈ పదవులు పొందడానికి వీరు అనర్హులు.
  4. లోకాయుక్త పాలనాధిపతి 'రిజిస్టార్ . ప్రత్యేక ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదాలో విచారణ సంచాలకుడు ఉంటాడు. ఇతడికి సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.
  5. లోకాయుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉప లోకాయుక్తకు హైకోర్టు ఇతర న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
  6. లోకాయుక్త, ఉప లోకాయుక్తలు తమ రాజీనామాను గవర్నర్ కు సమర్పించాలి .[2]

విధులు

[మార్చు]
  1. ప్రభుత్వ అధికార దుర్వినియోగం.
  2. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు.
  3. బాధితులు ఎవరైనా తమ అభియోగాలను లోకాయుక్త దృష్టికి తీసుకురావచ్చు .
  4. లోకాయుక్తకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.
  5. ఆరు సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదులుగా స్వీకరిస్తుంది. #లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారుచేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని అతడు పనిచేసే శాఖాధికారికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులపై సంబంధిత అధికారి మూడు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ సమాచారాన్ని లోకాయుక్తకు తెలియజేయాలి.
  6. లోకాయుక్త వివిధ ఫిర్యాదుల ప్రాథమిక విచారణను రహస్యంగా చేయాలి. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహా పూర్వకమైనవి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
  7. లోకాయుక్త నియామకంలో రాష్ట్ర మంత్రి మండలి సలహాలను గవర్నర్ తప్పనిసరిగా పాటించాలి.

చైర్మన్లు

[మార్చు]
నెం పేరు పదవి చేపట్టిన తేదీ పదవి ముగిసిన తేదీ
1 జస్టిస్ ఆవుల సాంబశివ రావు   14.11.1983  13.11.1988 
2 జస్టిస్ .ఏ. సీతారామ్ రెడ్డి   12.03.1990  11.03.1995
3 జస్టిస్ డి.జె. జగన్నాధ రాజు   11.05.1995  10.05.2000 
4 జస్టిస్ ఆర్. రామానుజం 12.07.2002  11.07.2007 
5 జస్టిస్ ఎస్. ఆనంద రెడ్డి 12.10.2007  11.10.2012 
6 జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి   12.10.2012 11.10.2017 
7 జస్టిస్‌ పి.లక్ష్మణ రెడ్డి [3] 15.09.2019 ప్రస్తుతం

మూలాలు

[మార్చు]
  1. Seetharaman, G (10 November 2018). "Delay in appointment of Lokpal & Lokayukta: Who will bell the graft?". The Economic Times. Retrieved 19 August 2021.
  2. Eenadu (13 June 2021). "లోక్‌పాల్, లోకాయుక్త". Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.
  3. 10TV (15 September 2019). "ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం" (in telugu). Archived from the original on 29 ఆగస్టు 2021. Retrieved 29 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)