ఆంధ్రప్రదేశ్ రైలు వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ రైలు మార్గాలు

ఆంధ్రప్రదేశ్ లో [1] బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25 కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు.[2] రైలు సాంద్రత 1,000 కి.మీ. (620 మై.)కు 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా ఉంది.[3] రాష్ట్రం గూండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి.[4][5] రైలు నెట్వర్క్ రెండు జోనుల పరిధిలో ఉంది. దీనిని డివిజన్లగా విభాగించారు. దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజన్, గుంటూరు రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్,[6] తూర్పుకోస్తా రైల్వే జోన్ లోని వాల్తేర్ రైల్వే డివిజన్.[7] రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటయింది.

రాష్ట్రమందలి రైలు మార్గము నాలుగు రైలు మండలముల పరిధిలోనున్నది. అవి:

  • దక్షిణ మధ్య రైల్వే-సికింద్రాబాదు విభాగము
  • దక్షిణ మధ్య రైల్వే-హైదరాబాదు విభాగము
  • దక్షిణ మధ్య రైల్వే-విజయవాడ విభాగము
  • దక్షిణ మధ్య రైల్వే-గుంతకల్లు విభాగము
  • దక్షిణ మధ్య రైల్వే-గుంటూరు విభాగము
  • తూర్పు కోస్తా రైల్వే - వాల్తేరు విభాగము
  • తూర్పు కోస్తా రైల్వే - ఖుర్దా రోడ్ విభాగము
  • నైఋతి రైల్వే- బెంగుళూరు విభాగము
  • నైఋతి రైల్వే- మైసూరు విభాగము
  • నైఋతి రైల్వే- హుబళ్ళి విభాగము
  • దక్షిణ రైల్వే- చెన్నై విభాగము
రైలు మండలము రైలు విభాగము పరిధి
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాదు
  • కాజీపేట-విజయవాడ మార్గమందు గంగినేని-కొండపల్లి
  • మోటమర్రి-జగ్గయ్యపేట
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాదు
  • కర్నూలు-డోన్ (ద్రోణాచలము జంక్షన్)
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ
  • విజయవాడ-కొండపల్లి
  • విజయవాడ-గూడురు
  • విజయవాడ-దువ్వాడ
  • సామర్లకోట-కాకినాడ
  • కాకినాడ-కోటిపల్లి
  • విజయవాడ-గుడివాడ
  • గుడివాడ-మచిలీపట్నం
  • గుడివాడ-భీమవరము-నరసాపురము
  • భీమవరము-నిడదవోలు
దక్షిణ మధ్య రైల్వే గుంటూరు
  • గుంటూరు-కృష్ణా కెనాల్(స్టేషను కాకుండగ)
  • గుంటూరు-తెనాలి(స్టేషను కాకుండగ)-రేపల్లె
  • గుంటూరు-నడికుడి-పొందుగుల
  • నడికుడి-మాచెర్ల
  • గుంటూరు-నంద్యాల
  • క్రొత్త పిడుగురాళ్ళ-శావల్యాపురము
దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు
  • గుంతకల్లు-బళ్ళారి మార్గమున గుంతకల్లు-టి.సాకిబండ
  • గుంతకల్లు-వాడి మార్గమున గుంతకల్లు-మంత్రాలయము రోడ్
  • గుంతకల్లు-గుంటూరు మార్గమున గుంతకల్లు-నంద్యాల (స్టేషను కాకుండగ)
  • గుంతకల్లు-రేణిగుంట
  • పెండేకల్లు-గుత్తి
  • గుంతకల్లు-కల్లూరు
  • గుత్తి-కల్లూరు
  • కల్లూరు-ధర్మవరము
  • ధర్మవరము-పాకాల
  • గూడూరు(స్టేషను కాకుండగ)-రేణిగుంట-పాకాల-కాట్పాడి(స్టేషను కాకుండగ)
  • నంద్యాల(స్టేషను కాకుండగ)-యఱ్ఱగుంట్ల
  • కడప-పెండ్లిమఱ్ఱి
తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు
  • చెన్నై-హౌరా మార్గమున దువ్వాడ-పలాస(స్టేషను కాకుండగ)
  • కొత్తవలస-కిరండోల్ మార్గమున కొత్తవలస-అఱకు-గోరాపుర్
  • విజయనగరము-రాయగడ మార్గమున విజయనగరము-పార్వతీపురము-కూనేరు
  • నౌపడ-గుణుపుర్ మార్గమున నౌపడ-పాతపట్నం
తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్
  • చెన్నై-హౌరా మార్గమున పలాస-ఇచ్చాపురము
నైఋతి రైల్వే బెంగుళూరు
  • బెంగుళూరు-గుంతకల్లు మార్గమున దేవరపల్లి-ధర్మవరము జంక్షన్ (స్టేషను కాకుండగ)
  • పెనుగొండ జంక్షన్-ధర్మవరము జంక్షన్ (స్టేషను కాకుండగ)
  • బెంగుళూరు-చెన్నై మార్గమున గుడుపల్లి-కుప్పం-ములనూరు
నైఋతి రైల్వే హుబ్బళ్ళి
  • బళ్ళారి-కదిరిదేవరపల్లి మార్గమున ఓబుళాపురము-రాయదుర్గము-కదిరిదేవరపల్లి
నైఋతి రైల్వే మైసూరు
  • రాయదుర్గము-చిర్తదుర్గ మార్గమున 11 కి.మి. (స్టేషనులేవియు లేవు)
దక్షిణ రైల్వే చెన్నై
  • చెన్నై-తిరుపతి మార్గమున శ్రీవేంకటనరసింహరాజువారిపేట-రేణిగుంట(స్టేషను కాకుండగ)
  • చెన్నై-గూడూరు మార్గమున తడ-గూడూరు జంక్షన్ (స్టేషను కాకుండగ)

మూడు ఎ1, ఇరవై మూడు ఎ రకపు రైల్వే స్టేషన్లున్నాయి.[8] విశాఖపట్నం రైల్వే స్టేషన్ అత్యంత స్వచ్ఛమైన రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.[9] షిమిలీగూడా రైల్వే స్టేషన్ తొలి బ్రాడ్ గేజ్ ర్వైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.[10]

మూలాలు

[మార్చు]
  1. "AP Budget 2018–19 Highlights – Sakshi". Archived from the original on 8 మార్చి 2018. Retrieved 28 ఫిబ్రవరి 2018.
  2. "Statewise Length of Railway Lines and Survey For New Railway Lines". pib.nic.in. Archived from the original on 5 జనవరి 2018. Retrieved 4 జనవరి 2018.
  3. "Infrastructure – Connectivity – Rail". apedb.gov.in. Andhra Pradesh Economic Development Board. Archived from the original on 29 జూన్ 2018. Retrieved 30 జూన్ 2018.
  4. "Bullet Train Corridors". Archived from the original on 16 సెప్టెంబరు 2017.
  5. "Diamond Quadrilateral". Archived from the original on 12 June 2017.
  6. "State-wise Route Kilometerage". South Central Railway. Archived from the original on 6 February 2011. Retrieved 23 April 2017.
  7. "ECoR – WALTAIR DIVISION". eastcoastrailwaywaltairdivision.blogspot.in. Archived from the original on 20 ఏప్రిల్ 2017. Retrieved 23 ఏప్రిల్ 2017.
  8. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Archived (PDF) from the original on 28 జనవరి 2016. Retrieved 23 ఏప్రిల్ 2017.
  9. "Vizag billed the cleanest rail station". The Hindu (in Indian English). Special Correspondent. 18 మే 2017. ISSN 0971-751X. Archived from the original on 4 జనవరి 2018. Retrieved 4 జనవరి 2018.{{cite news}}: CS1 maint: others (link)
  10. BHATTACHARJEE, SUMIT. "Hidden 100 – 58 tunnels. 84 bridges. Welcome to Araku Valley". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 9 జూన్ 2017. Retrieved 23 ఏప్రిల్ 2017.