ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం
ఆంధ్ర ప్రదేశ్ కు ఉత్తరాన తెలంగాణా, ఈశాన్య దిశలో ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, అఖాతం సరిహద్దులుగా ఉంది. తూర్పున బంగాళ ఖాతం దక్షిణాన తమిళనాడు నైరుతి పశ్చిమ దిశలో కర్ణాటక ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 974 కిలోమీటర్లు తీరప్రాంతం ఉంది . భారతదేశంలో అత్యంత పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రెండు నదులు, గోదావరి కృష్ణా ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా డక్కన్ పీఠభూమి ఉంది.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రాపథం, ఆంధ్రదేశం, ఆంధ్రావని, ఆంధ్ర అని పిలిచేవారు. [2]
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణం లోతట్టు తీర ప్రాంతాలలో సాధారణంగా వేడిగా తేమగా ఉంటుంది, అయితే ఇది అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా వేడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి కాలం సాధారణంగా మార్చి నుండి మే జూన్ వరకు ఉంటుంది. ఈ నెలల్లో ఆంధ్రప్రదేశ్లో తేమ స్థాయి తక్కువగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా అనంతపురం జిల్లాలో వర్షపాతం నమోదు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతుంది.
తూర్పు కనుమలలో నల్లమల కొండల వరకు ఉత్తరాన ఉన్న శేషాచలం కొండల వరకు అడవుల మధ్య 300 కిలోమీటర్ల వరకు ఆంధ్రప్రదేశ్లో అడవి విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల మార్గంలో వెంకటగిరి, బద్వేల్, పోరుమామిళ్ల, గిద్దలూరు మార్కాపరం వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
రాజకీయ భౌగోళిక శాస్త్రం
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ లో కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాలుగా విభజించబడ్డాయి. [3]
ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలు ఉన్నాయి అవి: అనంతపురం, అన్నమయ్య, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, చిత్తూరు, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, పల్నాడు ., శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి వైఎస్ఆర్ కడప జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.
ప్రకాశం జిల్లా 14,322 వైశాల్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖపట్నం తర్వాత విజయవాడ, గుంటూరు పెద్ద నగరాలుగా ఉన్నాయి. కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు ఏలూరు . లాంటి పెద్ద నగరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Fact File" (PDF). AP State Portal. Archived from the original (PDF) on 3 June 2016. Retrieved 16 July 2014.
- ↑ S. S. Ramachandramurthy (1995). A Study of Telugu Place-Names. Delhi: Agam Kala Prakashan. p. 10.
- ↑ AP Cabinet approves four regional planning boards Archived 10 మే 2008 at the Wayback Machine.