Jump to content

అహ్మద్ అలీ ఖాన్

వికీపీడియా నుండి
అహ్మద్ అలీ ఖాన్
నియోజకవర్గంకర్నూలు
వ్యక్తిగత వివరాలు
జననం
అహ్మద్ అలీ ఖాన్

(1977-05-04) 4 మే 1977 (age 47)
కర్నూలు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
చదువుబి.కాం కంప్యూటర్స్, ఉస్మానియా కళాశాల (కర్నూలు).

అహ్మద్ అలీ ఖాన్ (జననం 4 మే 1977) ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఇతను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాడు. ఇతను ప్రజాసేవకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

అహ్మద్ అలీ ఖాన్ కర్నూలులో మంచి వ్యాపారవేత్తలలో ఒకరిగా అభివర్ణించబడ్డాడు. ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని కర్నూలులో 1977, మే 4న మెహమూద్ అలీ ఖాన్‌కు జన్మించాడు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుండి బి.కాం డిగ్రీ (1998–99)ని పొందాడు.[1]

వ్యాపార జీవితం

[మార్చు]

అహ్మద్ అలీ ఖాన్ 1998 నుండి ఎంఎస్ఎ మోటార్స్ కర్నూలు డీలర్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఎంఎస్ఎ మోటార్స్ డైరెక్టర్. ఇతనుకు ఎంఎస్ఎ ట్రేడర్స్,[2] కమల్ ఎంటర్‌ప్రైజెస్[3] అనే ఇతర వ్యాపారాలు ఉన్నాయి.

రాజకీయ జీవితం

[మార్చు]

అహ్మద్ అలీ ఖాన్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడు. ఇతను కర్నూలు నగర అసెంబ్లీ ఇంచార్జ్‌గా ఒక పాత్ర పోషిస్తున్నాడు. ఇతను మైనారిటీ విభాగం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు.

2014 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహ్మద్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు నియోజకవర్గంలో పాల్గొన్నాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "My Neta Info". Retrieved 4 May 2014.
  2. "Exporters India".
  3. "My Neta Info". Retrieved 4 May 2014.
  4. "Empowring India". Archived from the original on 8 December 2019. Retrieved 16 May 2014.{{cite web}}: CS1 maint: unfit URL (link)

బాహ్య లింకులు

[మార్చు]