అస్మితా సూద్
అస్మితా సూద్(Asmita Sood) | |
---|---|
జననం | అస్మితా సూద్ డిసెంబర్ 20, 1991 సిమ్లా, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, ప్రచారకర్త |
క్రియాశీలక సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
అస్మితా సూద్ దక్షిణ భారత చలనచిత్ర నటి, ప్రచారకర్త.[1] బ్రహ్మిగాడి కథ చిత్రంద్వారా తెలుగు చిత్రరంగంలోకి కథానాయికగా ప్రవేశించిన అస్మితా తెలుగు (ఆడు మగాడ్రా బుజ్జి, ఆ ఐదుగురు, ఒకే), కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.[2]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]అస్మితా సూద్ 1991, డిసెంబర్ 20 న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలో జన్మించింది. నటుడు సోనూ సూద్ అస్మితాకి అన్న. డిల్లీ విశ్వవిద్యాలయంలో బి.కాం పూర్తిచేసింది.
వృత్తిజీవితం
[మార్చు]అస్మితా మోడల్ గా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించింది. 2010 చివర్లో ఛానల్ Vలో ప్రారంభమైన గెట్ గార్జియస్ అనే TV రియాలిటీ షో పాల్గొంది. 2011లో ఫెమీనా మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని, ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. కథక్ నృత్యంలో కూడా శిక్షణ పొందింది.
2011లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన బ్రహ్మిగాడి కథ తెలుగు చిత్రంద్వారా సినీరంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత కొన్ని తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2011 | బ్రమ్మిగాడి కథ | మాయ | తెలుగు | |
2013 | విక్టరీ | ప్రియా | కన్నడ | |
సుందరికాల్ | ఆమి | మలయాళం | ||
ఆడు మగాడ్రా బుజ్జి | ఇందు | తెలుగు | ||
2014 | ఒకే | తెలుగు | ||
ఆ ఐదుగురు[3] | తెలుగు | |||
అద్యక్షా | కళ్యాణి | కన్నడ | ||
2015 | లుక్కా చుప్పి | రాధిక | మలయాళం |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | కార్యక్రమం | పాత్రపేరు | భాష | ఛానల్ |
---|---|---|---|---|
2010 | గెట్ గార్జియస్ | పోటీదారురాలు | హిందీ | ఛానల్ V ఇండియా |
2015 | ఫిర్ భీ నా మనే ... బాట్టిమేజ్ దిల్ | మెహర్ పురోహిత్ | హిందీ | స్టార్ ప్లస్/హాట్స్టార్ |
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి. "గాజులంటే మోజు". Retrieved 30 June 2017.
- ↑ 123తెలుగు.కాం. "ప్రత్యేక ఇంటర్వ్యూ : అస్మితా సూద్ – ఇంకా నన్ను బాగా చూపించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నాను". Retrieved 30 June 2017.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ సాక్షి. "అతడే సీఎమ్ అయితే?". Retrieved 30 June 2017.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అస్మితా సూద్ పేజీ