అసైలేషన్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
అసైలేషన్ ఒక సమ్మేళనంతో అసైల్ గ్రూపును జోడించే ప్రక్రియ. అసైల్ గ్రూప్ అందించే సమ్మేళనాన్ని అసైలేటింగ్ ఏజెంట్ అంటారు.
అసైల్ హలైడ్లు లోహ ఉత్ప్రేరకాలతో చర్య జరిపినపుడు అవి బలమైన ఎలెక్ట్రోఫైల్స్ ను ఏర్పరుస్తాయి కాబట్టి వాటిని తరచుగా ఈ విధానంలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఫ్రీడెల్ - క్రాఫ్ట్స్ అసైలేషన్ చర్యలో ఎసిటైల్ క్లోరైడ్ (CH3COCl) ను అసైల్ గ్రూపును జోడించే సమ్మేళనం గాను, అల్యూమినియం క్లోరైడ్ (AlCl3) ను ఉత్ప్రేరకం గా ఉపయోగించినపుడు "ఎసిటైల్" (CH3CO-) బెంజీన్కు జోడించబడుతుంది.
![Friedel-Crafts acylation of benzene by ethanoyl chloride](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8b/Benzen_acylowany.svg/600px-Benzen_acylowany.svg.png)
పై చర్యా విధానమును ఎలెక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ ప్రతిక్షేపణ చర్య అంటారు.
అసైల్ హాలైడ్లు, కార్బాక్సిలిక్ ఆమ్లాల ఎన్హైడ్రైడ్లు సాధారణంగా అసైలేట్ అమైన్ల నుండి అమైన్లు గానూ లేదా అసైలేట్ ఆల్కహాల్ లనుండి ఎస్టర్లుగా మారుటకు అసైలేట్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అమైన్లు, అల్కహాళ్ళు నూక్లియోపైల్స్: నూల్కియోఫిలిక్ అసైల్ ప్రతిక్షేపణచర్య విధానం. సఖినిక్ ఆమ్లం సాధారణంగా ప్రత్యేక రకమైన అసైలేషన్ కు సాధారణంగా ఉపయోగపడుతుంది. దీనిని సఖినేషన్ ఆంటారు. ఎక్కువ సఖినేషన్ చర్య ఒక సఖినేట్ కలసి ఏకబంధం ఏర్పడినపుడు ఏర్పడుతుంది.[1] ఆల్కలేషన్ లో సాధారణంగా సంభవించే పునరమరిక చర్యలను నివారించుటకు అసైలేషన్ ను వడుతారు.
మూలాలు
[మార్చు]- ↑ Vollhardt, Peter; Schore, Neil (2014). Organic Chemistry: Structure and Function (7th ed.). New York, NY: W.H. Freeman and Company. pp. 714–715. ISBN 978-1-4641-2027-5.