Jump to content

అష్టదళ పాద పద్మారాధన

వికీపీడియా నుండి
(అష్టోత్తర శతనామావళి పూజ నుండి దారిమార్పు చెందింది)

అష్టదళ పాద పద్మారాధన అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామికి జరిపే సేవ. ఇది ప్రతి మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించబడుతుంది.

గుంటూరుకు చెందిన షేక్ మస్తాన్ అనే ముస్లిం భక్తుడు కూడా ఒక్కోక్క పుష్పం బరువు 23 గ్రాములతో 108 బంగారు పద్మాలను కానుకగా సమర్పించాడు. 1984 నుండి ప్రతి మంగళవారం అతని పేరిట అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవ మొదలు పెట్టారు.[1][2] అష్టోత్తర శతనామావళి పూజను ఈ స్వర్ణ తామరపూలతోనే నిర్వహిస్తున్నారు.

ఈ సేవ కోసం చెల్లించిన ఆర్జిత భక్తులను బంగారు వాకిలి, కులశేఖరప్పడి మధ్య మండపంలోకి వెళ్లి కూర్చోవడానికి అనుమతిస్తారు.

సేవ సమయాలు

[మార్చు]
  • రిపోర్టింగ్ సమయం కోసం - 05:00 AM
  • అష్టదళ పాద పద్మారాధన 06:00 AM– 07:00 AM వరకు ప్రారంభమవుతుంది.
  • అష్టదళ పాద పద్మారాధన టిక్కెట్టు ధర రూ. 1250/-.
  • 2 పెద్ద లడ్డూలు, 2 వడలు ప్రసాదంగా, వస్త్ర బహుమానం (పురుషులకు పై వస్త్రం (ఉత్తరీయం), మహిళలకు 1 బ్లౌజ్ పీస్) టిక్కెట్ హోల్డర్‌లకు ఇవ్వబడతాయి.

షేక్ మస్తాన్

[మార్చు]

గుంటూరు వాస్తవ్యుడు.శ్రీ వేంకటేశ్వరుని భక్తుడు ఒక్కోక్క పుష్పం బరువు 23 గ్రాములతో 108 బంగారు పద్మాలను కానుకగా సమర్పించగా 1984 నుండి ప్రతి మంగళవారం అతని పేరిట అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవ మొదలు పెట్టారట. అష్టోత్తర శతనామావళి పూజను ఈ స్వర్ణ తామరపూలతోనే నిర్వహిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Tirumala Tirupati Devasthanams (Official Website)". www.tirumala.org. Retrieved 2023-09-09.
  2. "శ్రీనివాసుడి ఆర్జిత సేవ వెనుక ఓ ముస్లిం భక్తుని కథ." Samayam Telugu. Retrieved 2023-09-09.